coronavirus: తెలంగాణలో మూడో కరోనా కేసు
ఇప్పటికే ప్రపంచ దేశాలను గడగడా వణికిస్తున్న `కరోనా వైరస్`... భారత దేశంలోనూ విజృంభిస్తోంది. అందులోనూ తెలంగాణలోనే ఇప్పటి వరకు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో వ్యక్తికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 3కు పెరిగింది.
ఇప్పటికే ప్రపంచ దేశాలను గడగడా వణికిస్తున్న 'కరోనా వైరస్'... భారత దేశంలోనూ విజృంభిస్తోంది. అందులోనూ తెలంగాణలోనే ఇప్పటి వరకు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో వ్యక్తికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 3కు పెరిగింది. ఫలితంగా తెలంగాణ ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడు ఏ భయం ముంచుకొస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు.
Read Also: గుజరాత్‌లో పొలిటికల్ డ్రామా..!!
గాంధీ ఆస్పత్రిలో ఓ యువకుడికి కరోనా వైరస్ పూర్తిగా నయమై డిశ్చార్జి అయ్యాడు. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలోనే మూడో పాజిటివ్ కేసు నమోదు కావడం గుబులు పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోవిడ్ 19 వైరస్ కేసుల సంఖ్య 107కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 31 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో 12 కొత్త కేసులు నమోదు కావడం విశేషం. దీంతో కరోనా వైరస్ అనుమానిత కేసుల సంఖ్య మహారాష్ట్రలో 31కి చేరుకుంది.
మరోవైపు కేరళలో 22 కేసులు, యూపీలో 11 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో 11 కేసులు నమోదయ్యాయి. కానీ వారంతా విదేశీయులే కావడం విశేషం. ఢిల్లీలో 7, కర్ణాటకలో 6, జమ్మూ కాశ్మీర్ 2, లఢఖ్‌లో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..