Telangana high court CJ: పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రతీ పౌరుడు అందుకు బాధ్యత తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ (High Court CJ Satish Chandra Sharma) పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ నూతన కార్యాలయాన్ని అథారిటీ ఛైర్మన్ జస్టిస్ ప్రకాశ్‌తో కలిసి సీజే ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ... తాను హైదరాబాద్ వచ్చినప్పుడు హుస్సేన్ సాగర్ (Hussain Sagar) అందంగా ఉంటుందని చెప్తే విన్నానని అన్నారు. దీంతో నగరంలో మొదట హుస్సేన్ సాగర్ చూడాలనుకున్నానని... ఇదే విషయం డ్రైవర్‌తో చెప్పి అక్కడికి వెళ్లానని తెలిపారు. కానీ తీరా అక్కడికి వెళ్లాక కనీసం 5 నిమిషాలు కూడా ఉండలేకపోయానని అన్నారు. ఇక హైకోర్టు ఎదురుగా ఉన్నది చూసి నాలా అనుకున్నానని... కానీ అది మూసీ నది (Musi River) అని చెప్పడంతో షాక్ తిన్నానని తెలిపారు. పర్యావరణానికి ఎంత హానీ చేస్తున్నామో ఇక్కడే అర్థమవుతోందన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని... పర్యావరణానికి హానీ తలపెట్టవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు.


Also Read:‘'బాలిక దుస్తుల మీద తాకడం లైంగిక వేధింపే': సుప్రీంకోర్టు


తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శ‌ర్మ (Telangana High Court CJ) ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన న్యాయశాస్త్రంలో 3 గోల్డ్ మెడల్స్ సాధించారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2003లో కేంద్ర ప్రభుత్వ అదనపు కౌన్సిల్‌గా, 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ప్యానల్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2008లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. కొద్ది నెలలు కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక సీజేగా వ్యవహరించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత సీజేగా నియమితులైనవారిలో సతీష్ చంద్ర శర్మ నాలుగో వారు. అంతకుముందు జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook