AP & TS High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

AP & TS High Courts: రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ఛీఫ్ జస్టిస్‌లు రానున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్రశర్మ, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పీకే మిశ్రా నియమితులయ్యారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2021, 10:33 AM IST
  • ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం
  • ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పీకే మిశ్రా
  • తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్రశర్మ, రేపు ప్రమాణ స్వీకారం
AP & TS High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

AP & TS High Courts: రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ఛీఫ్ జస్టిస్‌లు రానున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్రశర్మ, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పీకే మిశ్రా నియమితులయ్యారు. 

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు(AP High Court) ఛీఫ్ జస్టిస్‌గా పీకే మిశ్రా నియమితులు కాగా, తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా సతీష్ చంద్రశర్మ నియామకమైంది. దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16వ తేదీన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా సతీష్ చంద్రశర్మ రేపు అంటే అక్టోబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ సతీష్ చంద్రశర్మ మద్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. 2008లో మద్యప్రదేశ్ అదనపు న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రదాన న్యాయమూర్తిగా బాధ్యతల్ని నిర్వహించారు. ఎక్కువకాలం న్యాయవాదిగా సేవలందించారు. తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ఛీఫ్ జస్టిస్ హిమకోహ్లి..సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియామకం అనివార్యమైంది.

ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీకే మిశ్రా నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జన్మించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. 2009లో ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులై ప్రస్తుతం అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

Also read: MAA Elections Polling: ఇలాంటి ఎన్నికల్ని ఎన్నడూ చూడలేదంటున్న పవన్ కళ్యాణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News