జగిత్యాల: విదేశాల నుండి వచ్చిన వారి నుండి కరోనావైరస్ (Coronavirus) వ్యాపిస్తున్న కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లొచ్చిన వారిని (Foreign travel hostory) అధికారులు ఎక్కడికక్కడే క్వారంటైన్ హోమ్స్‌కి (Quarantine homes) తరలిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ నెల 7న అమెరికాకు వెళ్లొచ్చిన ఇద్దరు దంపతులను పోలీసులు కరీంనగర్ క్వారంటైన్ హోమ్‌కి తరలించగా.. వారు అక్కడ ఉండకుండా కరీంనగర్‌ నుంచి జగిత్యాలకు వెళ్లడం కలకలం సృష్టించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్వారంటైన్ హోమ్ నుంచి ఇద్దరు దంపతులు జగిత్యాలకు వెళ్లారని తెలుసుకున్న స్థానిక ఆర్డీఓ, సీఐ జయేష్ రెడ్డి.. హుటాహటిని వారిని వెతికిపట్టుకున్నారు. జగిత్యాల విద్యానగర్‌లో దంపతులను గుర్తించిన జగిత్యాల ఆర్డీవో నరేందర్‌, సీఐ జయేష్‌రెడ్డి.. అంబులెన్స్‌ ద్వారా వారిని వెంటనే తిరిగి క్వారంటైన్ హోమ్‌ కేంద్రానికి తరలించారు.


Read also : లాక్‌డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే


జగిత్యాల విద్యానగర్‌లో ఓ రెవెన్యూ విశ్రాంత ఉద్యోగి తన ఇంట్లో నిర్వహించిన సంవత్సరీకం కార్యక్రమానికి ఈ దంపతులు హాజరయ్యారు. దీంతో ఓ వైపు దేశం అంతటా లాక్‌డౌన్ (Lockdown) అమలులో ఉండగా.. మరోవైపు అనుమతి లేకుండా సంవత్సరీకం నిర్వహించినందుకు సదరు రెవెన్యూ విశ్రాంత ఉద్యోగిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతీ పౌరుడు బాధ్యాతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను పోలీసులు ఆ విశ్రాంత రెవిన్యూ ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..