COVID-19 cases in Telangana: హైదరాబాద్‌ : తెలంగాణలో గత 24 గంటల్లో 65,923 శాంపిళ్లను పరీక్షించగా వాటిలో కొత్తగా 4,826 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌ శాఖ‌ విడుదల చేసిన లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 7,754 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య మొత్తం 5,02,187కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ యాక్టివ్‌ కేసులు 62,797కు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేటివరకు 2771 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 


Also read : Telangana govt: తెలంగాణలో 50 వేల మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


తెలంగాణలో లాక్‌డౌన్ విధింపు అంశంపై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ (Telangana cabinet meeting) నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ కేబినెట్ సమావేశం అనంతరం లాక్‌డౌన్‌పై (Lockdown in Telangana) కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook