Covid-19 positive cases: హైద‌రాబాద్‌: ‌తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా కరోనావైరస్ కేసుల సంఖ్య 90వేల మార్క్ దాటింది. గత 24గంటల్లో 1863 కరోనాకేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ ( health ministry of telangana) శనివారం వెల్లడించింది. దీంతోపాటు శుక్ర‌వారం 10 మంది మ‌ర‌ణించినట్లు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణ ( Telangana ) లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 90,259కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మహమ్మారి మరణాల సంఖ్య 684కి చేరింది. Also read: Aatmanirbhar Bharat: ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తెలంగాణలో 23,379 పలు ఆసుపత్రుల్లో, కోవిడ్ సెంటర్లల్లో చికిత్స పొందుతుండగా.. 16,221 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 66196 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 73.34 శాతంగా ఉండగా.. మ‌ర‌ణాల రేటు 0.75 శాతంగా ఉంది.  నిన్న ఒక్క‌రోజే 21,239 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. Also read : SP Balu: నాకేం కాదు.. ఐసీయూలో ఎస్పీ బాలు థంబ్స్ అప్ ఫోటో వైరల్


శుక్రవారం న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 394 కేసులు నమోదు కాగా.. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 175, రంగారెడ్డి జిల్లాలో 131, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 104, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌ జిల్లాలో 101, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో 90 చొప్పున ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.  Also read : Lav Agarwal: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీకి కరోనా