Telangana Covid-19 Cases: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేయికి పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. ఆదివారం వేయికి తక్కువగా కేసులు నమోదుకావడం కాస్త ఊరట కలిగిస్తోంది. గత 24గంటల్లో రాష్ట్రంలో ఆదివారం 894 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 10మంది మరణించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో ఇప్పటివరకు 92,255 కరోనా కేసులు నమోదు కాగా..కరోనా మరణాల సంఖ్య 703కు చేరింది. Also read: India: 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రాష్ట్రంలో 21,420 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు  70,132 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆదివారం రాష్ట్రంలో 8,794 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 7,53,349 మంది నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది.   Also read: Neeli Neeli Aakasam Song: 'నీలి నీలి ఆకాశం' మరో రికార్డ్


ఆదివారం నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా పరిధిలో 147 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 85, కరీంనగర్ జిల్లాలో 69, పెద్దపల్లి జిల్లాల్లో 62, సిద్దిపేట జిల్లాలో 58, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 51, ఖమ్మంలో 44, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 44 చొప్పున కోవిడ్19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ( TS Govt ) వెల్లడించింది. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..


[[{"fid":"190727","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]