Coronavaccine Covid-19 Vaccine Phase 3 Trials | కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ ఫేస్ 3 క్లినికల్ ట్రయల్ ఈ వారంలో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ( NIMS ) లో ప్రారంభం అవనుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) అదేశాల మేరకు కోవిడ్-19 వ్యాక్సిన్ పేస్ 3 ట్రయల్స్ ను ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | YSR Badugu Vikasam: వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్


ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ ఆఫ్ నిమ్స్ ( IEC-NIMS ) మంగళవారం రోజు కోవాగ్జిన్ పేస్ 3 మానవ దశ ట్రయల్స్  గురించి సమావేశం నిర్వహించనుంది. 200 నుంచి 300 మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ అందజేస్తాం అని తరువాత వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తామని తెలిపారు అధికారులు.


ఫేస్ 3 ట్రయల్స్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి అని తరువాత ఫిబ్రవరిలోపు చివరి అప్రూవల్ పొంది మార్కెట్ లో అందుబాటులోకి తీసుకురావాలి అని భావిస్తున్నారు.



READ ALSO | Funny Dance: ఇంత విచిత్రమైన డ్యాన్స్ మీరు ఎప్పుడూ చూసుండరు


కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ సంస్థ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) సంయుక్తంగా సిద్ధం చేస్తున్నాయి. ఇటీవలే పేస్ 3 ట్రయల్స్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జెనలర్ ఆఫ్ ఇండియా ( DGCI )ను అక్టోబర్ 2వ తేదీన అనుమతి కోరింది భారత్ బయోటెక్. ఇటీవలే దీనికి అనుమతి లభించింది.


ప్రస్తుతం ట్రయల్స్ ఢిల్లీ, ముంబై, పుణే, ఓడిశా సహా మొత్తం 19 ప్రాంతాల్లో జరుగుతున్నాయి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR