Wife Killed Husband with the help of Boyfriend in Siddipet: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను భార్యలు హత్యలు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. పెళ్లికి ముందు ప్రేమలో పడడం లేదా పెళ్లి తర్వాత అక్రమ సంబంధాల కారణంగా.. పక్కా ప్రణాళిక ప్రకారం భర్తలను హత్యలు చేస్తున్నారు భార్యలు. తాజాగా ఇలాంటి ఘటనే తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఓ యువతి ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. గత నెల 28న ఛాతీలో నొప్పితో భర్త చనిపోయాడని అందరికీ చెప్పినా.. పోలీసుల దర్యాప్తులో మాత్రం అసలు విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్దిపేట పట్టణ టూటౌన్‌ సీఐ వి రవి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బాక మండలం చిన్ననిజాం పేటకు చెందిన 24 ఏళ్ల కోనాపురం చంద్రశేఖర్‌కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన 19 ఏళ్ల శ్యామలతో 2022 మార్చి 23న వివాహం అయింది. గుడికందులకే చెందిన శివ కుమార్‌ (20)తో గత మూడేళ్లుగా  శ్యామల ప్రేమలో ఉంది. పెద్దల ఒత్తిడి కారణంగా చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న శ్యామల.. పెళ్లైన రోజు నుంచి శివతో సరిగా లేదు. ప్రియుడు శివను మర్చిపోలేపోయింది. దాంతో శ్యామల, శివలు చంద్రశేఖర్‌కు హత్య చేసేందుకు ప్రణాళిక వేశారు. 


చంద్రశేఖర్‌ను హతమార్చేందుకు గత ఏప్రిల్‌ 19న ఆహారంలో ఎలుకల మందు కలిపింది శ్యామల. అది తిన్న చంద్రశేఖర్‌ అస్వస్థతకు గురై.. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నాడు. ఆహారం తేడా కొట్టడంతోనే చంద్రశేఖర్‌ అస్వస్థతకు గురయ్యాడని అప్పుడు అందరూ అనుకున్నారు. ఆ స్కెచ్ ఫెయిల్ అవ్వడంతో రెండోసారి పక్కా ప్రణాళికతో.. ఆలయంలో మొక్కు ఉందని చెప్పి ఏప్రిల్‌ 28న ద్విచక్ర వాహనంపై శ్యామల భర్తను తీసుకొని వెళ్లింది. 


ఏకాంతంగా గడుపుదామంటూ చంద్రశేఖర్‌ను శ్యామల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెల్లగా.. అక్కడే ఉన్న శివ, అతడి స్నేహితులు వారిని అడ్డుకున్నారు. ఆపై శివ, శ్యామల కలిసి తువాల సాయంతో చంద్రశేఖర్‌ గొంతు నులిమి చంపేశారు. ఛాతీలో నొప్పితో చనిపోయాడని శ్యామల బంధువులకు చెప్పింది. అయితే అనుమానం వచ్చిన చంద్రశేఖర్‌ తల్లి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. నిందితులను ఆదివారం సిద్దిపేటలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 


Also Read: Geetha Arts: గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా సునీత ధర్నా.. కారణం ఇదే!


Also Read: MS Dhoni Record: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook