MS Dhoni became first batter scores 2500 runs in death overs in IPL: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాట్‌తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతిసారి బౌండరీల మోత మోగిస్తూ జట్టుకు విలువైన పరుగులు జోడిస్తునాడు. 15వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన ధోనీ.. ఆ తర్వాత అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ 2022లో 11 మ్యాచులు ఆడిన ధోనీ.. 163 రన్స్ చేశాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో తనదైన శైలిలో ఆడి.. తనలోని ఫినిషర్ ఇంకా సజీవంగానే ఉన్నాడని చాటి చెప్పాడు.
ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ చెలరేగాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్ వచ్చిన ధోనీ.. 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్‌లు, 1 ఫోర్ ఉన్నాయి. మహీ ధాటికి చెన్నై జట్టు స్కోర్‌ను 200 దాటింది. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో చెన్నై కెప్టెన్ ఓ అరుదైన రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా మహీ రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు.
ఈ మ్యాచ్ ద్వారా ఎంఎస్ ధోనీ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. టీ20ల్లో కెప్టెన్‌గా 6వేల పరుగుల మైలురాయిని మహీ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు 6వేల పరుగులకు 6 పరుగుల దూరంలో నిలిచిన మహీ.. 21 రన్స్ బాదడంతో ఆ రికార్డు అధిగమించాడు. మొత్తంగా కెప్టెన్‌గా 185 ఇన్నింగ్స్‌లో 5994 పరుగులు చేశాడు. ధోనీ కన్నా ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే కెప్టెన్‌గా 6వేల పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (87; 49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ (41; 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబే (32; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ (25), శార్దుల్ ఠాకూర్ (24) మినహా ఎవరూ రాణించలేదు.
Also Read: Jagadeesha Suchith Record: జగదీశ సుచిత్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో మూడో స్పిన్నర్‌గా..!
Also Read: Sarkaru Vaari Paata: మహేష్ 'సర్కారు వారి పాట' జోరు... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook