Meerpet Incident: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన భార్యను చంపి కుక్కర్‌, హీటర్‌తో ఉడికించిన సంఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు అత్యంత సవాల్‌ విసిరన మీర్‌పేట హత్య కేసులో వాస్తవాలు తెలిశాయి. నిందితుడు గురుమూర్తి భార్యను ఎలా చంపాడు? ఏ విధంగా శవాన్ని మాయం చేశాడు? అనే విషయాలను పక్కా ఆధారాలతో తెలుసుకున్నారు. పోలీస్‌ శాఖకే సవాల్‌ విసిరిన ఈ కేసును ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు చేధించారు. అయితే ఈ సంఘటనలో జరిగిన పరిణామాలు తెలుసుకుని పోలీసులు విస్మయం చెందారు. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపుతారా? అని పోలీస్‌ కమిషనర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: School Holiday: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. రేపు స్కూళ్లకు ఎలాంటి సెలవు లేదు


గురుమూర్తి కేసు వివరాలను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు మంగళవారం మీడియాకు పూసగుచ్చినట్టు వెల్లడించారు. భార్య వెంకట మాధవిని ఇంత దారుణంగా చంపిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని సీపీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించేందుకు తాము తీవ్రంగా శ్రమించినట్లు చెప్పారు. ‘ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా? అని మేమే నివ్వెరపోయాం. ఇది క్షణికావేశంలో జరిగిన హత్య కాదు.. పథకం ప్రకారమే జరిగింది. గురుమూర్తి ఒక క్రూరుడు’ అని కమిషనర్‌ సుధీర్‌ బాబు వివరించారు.

Also Read: BRS Party MLA: బీఆర్ఎస్ పార్టీలోకి మరో ఫిరాయింపు ఎమ్మెల్యే? కీలక పరిణామంతో కన్ఫార్మ్


జరిగింది ఇదే!
వెంకటమాధవిని ఎలా హత్య చేశాడు? ఆ రోజు ఏం జరిగింది? అనేది కమీషనర్‌ వివరించారు. సీపీ వివరాల ప్రకారం.. 'సంక్రాంతి పండగకు భార్య మాధవి, పిల్లల్ని తీసుకుని గురుమూర్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. జనవరి 15వ తేదీన పిల్లల్ని బంధువుల ఇంటి వద్దే వదిలేసి భార్య వెంకటమాధవిని తీసుకుని గురుమూర్తి రాత్రి 10.41 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. 16వ తేదీన ఉదయం 8 గంటలకు భార్యతో గొడవ పడ్డాడు. ఘర్షణలో భార్య తలను గోడకేసి కొట్టాడు. కొట్టడంతో కిందపడిపోయిన వెంకటమాధవిని తర్వాత గురుమూర్తి గొంతు నులిమి చంపేశాడు' అని సీపీ వెల్లడించారు.


మృతదేహాన్ని ఇలా..
'మృతదేహాన్ని మాయం చేసేందుకు కొత్త పద్ధతులు వాడాడు. ఇంట్లో ఉన్న కత్తితో కాళ్లు, చేతులు, శరీరం, తల నాలుగు భాగాలుగా కట్‌ చేశాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మృతదేహాన్ని ముక్కలు చేశాడు. అనంతరం వాటర్‌ హీటర్‌తో నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడక బెట్టాడు. ఆ తర్వాత స్టవ్‌పై పెట్టి కాల్చాడు. రోకలిబండ తీసుకుని ఆ భాగాలను దంచి పొడిగా మార్చాడు. ఆ పొడిని ప్లాస్టిక్‌ బకెట్‌లో నింపి జిల్లెలగూడ చెరువులో పోశాడు. అనంతరం ఇంటికి వెళ్లి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చాడు' అని సీపీ వెల్లడించారు.


ఈ కేసులో స్టవ్, కత్తి, రోలర్, రోలర్ స్టోన్, బకెట్, వాటర్ హీటర్, రూమ్ ఫ్రెషనర్‌, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, స్క్రాప్ బకెట్, సర్ఫ్ ప్యాకెట్, బ్లాక్ కలర్ షర్ట్, మృతురాలి డ్రెస్, రెండు మొబైల్ ఫోన్లు సహా మొత్తం 16 వస్తువులను సీజ్‌ చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు తెలిపారు. సాధారణంగా గురుమూర్తి మెతక స్వభావి అని.. కానీ ఇంత రాక్షసంగా ఎలా మారాడో అని కుటుంబసభ్యులు, బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీలో 15 ఏళ్లు పనిచేసిన గురుమూర్తి ఇలా చేయడాన్ని ఎవరూ ఊహించడం లేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.