Jani master: గోవాలో జానీ మాస్టర్ అరెస్టు.. లేడీ కొరియోగ్రాఫర్ అత్యాచార ఘటనలో కీలక పరిణామం..
Jani master rape case: జానీ మాస్టర్ ను గొవాలో ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. దీనిపై ఇప్పటికే టాలీవుడ్ లో పెనుదుమారంగా మారింది.
Cyberabad SOT Police Arrested jani master: సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేశారు. ఇప్పటికే పోలీసులు.. పోక్సో కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా పోలీసులు .. నాన్ బెయిలబుల్ కేసును కూడా నమోదు చేసి జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చారు. దీంతో టాలీవుడ్ లో ఈ ఘటన సంచలనంగా మారింది. జానీ మాస్టర్.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని లేడీ కొరియో గ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లేడీ కొరియో గ్రాఫర్ పై వేధింపులు, అత్యాచారం ఘటన తెలుగు స్టేట్స్ లలో సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు.
2017 లో యువతి డ్యాన్స్ ప్రొగ్రామ్ లో.. జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తన టీమ్ లోకి రావాలని కూడా జానీమాస్టర్ టీమ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో 2019 నుంచి వేధింపుల పర్వం స్టార్ట్ అయ్యిందంట. అంతేకాకుండా.. ముంబైలో ప్రొగ్రామ్ కోసం తీసుకెళ్లి.. రెస్టారెంట్ గదిలో.. అత్యాచారంకు పాల్పడ్డాడని.. జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో నార్సింగ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. మరోవైపు ఇప్పటికే దీనిపై ఇటు రాజకీయంగా , టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా.. దీనిపై ఇప్పటికే తెలంగాణ మహిళ కమిషన్, బీజేపీ, కాంగ్రెస్ మహిళ సంఘాలు సైతం ఖండించాయి. ఇది లవ్ జీహాద్ కు చెందిన ఘటన అంటూ.. గోషా ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు జానీ మాస్టర్ గత మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జానీ మాస్టర్ దేశం విడిచి వెళ్లిపోయాడని కూడా ప్రచారం జరిగింది. కానీ నెల్లూరులో ఉన్నాడని కూడా పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ ను జనసేన సస్పెండ్ చేసింది. కొరియోగ్రాఫర్ ల కమిటీ నుంచి కూడా.. జానీమాస్టర్ ను సస్పెండ్ చేశారు.
Read more: Romance Video: బస్సులో రెచ్చిపోయిన లవర్స్.. సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్.. వీడియో వైరల్..
దీనిపై ఇప్పటికే బాధితురాలి నుంచి పోలీసులు స్టేట్ మెంట్ ను నమోదు చేశారు. అదే విధంగా తెలంగాణ మహిళ కమిషన్ ఆదేశాల మేరకు.. పోలీసులు బాధితురాలికి ప్రత్యేకంగా భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ మీద.. పోక్సో, నాన్ బెయిలెబుల్ కేసులు తోపాటు.. 376, 506, 323 (2) సెక్షన్ల కింద కేసు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.