Rashmika Vijay Devarkonda : రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ ఉంది.. అని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీరు మాట్లాడే ప్రతి మాటలోను వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే.. అపోహ మనలో కలగక మానదు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వీరిద్దరి ప్రేమపై.. మరిన్ని అనుమానాలను తెచ్చిపెట్టాయి.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మిక మందన్న తొలిసారి కలిసి నటించిన చిత్రం గీతా గోవిందం.
ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ జంట మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ జోడీ గా పేరు సొంతం చేసుకుంది. వీరిద్దరి పర్ఫామెన్స్ కి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు.
అయితే ఈ సినిమా పరిచయం కాస్త వీరిద్దరి మధ్య ప్రేమగా మారిందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీరు మాత్రం ఆ విషయాలపై నోరు మెదపలేదు.
రష్మిక ఏమో విజయ్ దేవరకొండ నా ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తోంది. విజయ్ దేవరకొండ రష్మిక తో కలిసి పలు వెకేషన్ లకి వెళ్తున్న ఫోటోలు షేర్ చేస్తున్నాడు. ఇలా ఇద్దరి మధ్య బంధం ఉన్నా.. ఏమీ లేదు అన్నట్టుగానే కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దీనికి తోడు తాజాగా తమ ఫేవరెట్ సాంగ్ ఒకటే అంటూ అందరికీ హింట్ ఇచ్చారు. ఐడియల్ సింగింగ్ కాంపిటీషన్లో రష్మిక , విజయ్ దేవరకొండ విడివిడిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తన కెరీర్లో ఫేవరెట్ సాంగ్ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన డియర్ కామ్రేడ్ లోని కడలల్లే పాటంటే ఇష్టమని తెలిపింది రష్మిక. అలాగే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట అంటే కూడా ఇష్టమని తెలిపింది.
మరొకవైపు అదే షో లో పాల్గొన్న విజయ్ దేవరకొండ కూడా తనకు కూడా కడలల్లే పాట అంటే చాలా ఇష్టమని, తన ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ఒకే వీడియోలో జోడిస్తూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మనుషులు వేరైనా మనసులు ఒక్కటే ఇద్దరికీ ఒకే పాట ఫేవరెట్ గా నిలిచింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.