Dasara bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌తో Good news చెప్పిన సీఎం కేసీఆర్
Dasara bonus for Singareni employees: హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా బోనస్ రూపంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్జించిన లాభాల్లోంచి 29 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Dasara bonus for Singareni employees: హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా బోనస్ రూపంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్జించిన లాభాల్లోంచి 29 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది దసరా బోనస్ (Singareni employees Dasara Bonus) కంటే ఇది ఒక శాతం అదనం కావడం గమనార్హం.
సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పిన కేసీఆర్.. కార్మికుల భవిష్యత్, అభివృద్ధి దృష్ట్యా సింగరేణి కార్యకలాపాలను బొగ్గు తవ్వకానికే పరిమితం చేయకుండా ఇసుక, ఇనుము, సున్నపు రాయి తదిత ఖనిజాల తవ్వకాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, సింగరేణి కార్మికుల (Singareni employees) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.
Also read : Motkupalli Narsimhulu: దళిత బంధు పథకం కమిటీ చైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు ?
కార్మికులు ఎంతో కష్టపడి పనిచేయడం వల్ల సింగరేణికి బొగ్గుగని మైనింగ్ (Singareni coal mining), పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానం లభించిందని గుర్తుచేశారు. అందుకే కార్మికుల శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యాలను తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుంది. బొగ్గు తవ్వకంతో పాటు రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాలను చేపట్టి కార్మికులకు పని, ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వమే పూనుకుంటుందని సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టంచేశారు.
Also read : Telangana Assembly Session 2021: దళిత బంధు ఉప ఎన్నికల కోసం కాదు..దళితుల అభివృద్దికే : CM KCR
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook