Mlc Kavitha: సీబీఐ నుంచి నో రిప్లై.. ట్విస్ట్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ కవిత..?
Cbi Notice To Trs Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె విచారణకు హాజరవుతారా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.
Cbi Notice To Trs Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు రావడం అధికార టీఆర్ఎస్ పార్టీలో కలవరం రేపుతోంది. డిసెంబర్ 6 మంగళవారం ఆమె సీబీఐ ముందు హాజరుకానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీబీఐ నోటీసులు వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమెకు విచారణలో ఏం చెప్పాలనే విషయాలపై కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. సీబీఐ నోటీసులు, భవిష్యత్ కార్యాచరణపై ఆమె చర్చించినట్లు సమాచారం. రేపు ఏం జరగబోతుందోనని గులాబీ పార్టీలతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.
కాగా.. ఎఫ్‌ఐఆర్, కంప్లైంట్ కాపీని పంపించాలని సీబీఐకి కవిత లేఖ రాయగా.. ఇంతవరకు సీబీఐ నుంచి రిప్లై రాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐకు కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీని పంపించాలని ఆమె కోరారు. అంతేకాకుండా ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తనకు పంపించాల్సిందిగా సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షాహికి కవిత లెటర్ రాశారు. ఆ వివరాలు తనకు పంపిస్తే.. వివరణ ఇచ్చేందుకు సులువు అవుతుందని అన్నారు. ఆ డాంక్యుమెంట్స్ పంపించిన తరువాత సీబీఐ అధికారులకు వివరణ ఇచ్చే తేదీని ఫిక్స్ చేద్దామంటూ కవిత లేఖలో పేర్కొన్నారు.
కవిత వివరణ ఇచ్చేందుకు ఒక్క రోజే సమయం ఉన్న తరుణంలో ఆమె రాసిన లేఖకు ఇప్పటివరకు రెస్పాన్స్ రాలేదు. తాను అడిగిన డాంక్యుమెంట్స్ రాకపోవడంతో కవిత విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. తనకు ఫిర్యాదు కాపీలు వస్తేనే విచారణ తేదీని ఫిక్స్ చేయాలని కవిత అనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ డాంక్యుమెంట్లపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని.. విచారణను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ఓ నిర్ణయానికి రావాలని కవిత అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే కవిత అడిగిన డాంక్యుమెంట్స్, ఎఫ్ఐఆర్ కాపీలను సీబీఐ అధికారులు నేరుగా తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందని మరికొందరు అంటున్నారు. డిసెంబర్ 6న విచారణకు హాజరవుతానని చెప్పిన కవిత.. డాంక్యుమెంట్స్ వచ్చిన తరువాత డేట్ ఫిక్స్ చేద్దామంటూ లేఖ రాయడం చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు ఆమె విచారణకు హాజరవుతారా..? లేదా..? అనే విషయం సస్పెన్స్‌గా మారింది.
Also Read: Gujarat Election 2022: నేడే గుజరాత్‌లో రెండో దశ పోలింగ్.. ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు వేసేది ఇక్కడే..
Also Read: PAN-Aadhaar Link: ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేశారా..? ఆ రోజే లాస్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి