PAN-Aadhaar Link: ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేశారా..? ఆ రోజే లాస్ట్..!

Pan Aadhaar Link Last Date: పాన్ కార్డుదారులకు ఆదాయపు పన్ను శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటివరకు మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయకపోతే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు మీ పాన్ కార్డు కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2022, 07:56 AM IST
PAN-Aadhaar Link: ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేశారా..? ఆ రోజే లాస్ట్..!

Pan Aadhaar Link Last Date: ప్రస్తుతం మన దేశంలో ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఆధార్ లేకుంటే ప్రభుత్వం నుంచి ఏ పథకం కూడా రాదు. మీరు కూడా ఆధార్-పాన్ కార్డ్ హోల్డర్ అయితే మీకో అలర్ట్. 2023 మార్చి 31 నాటికి పాన్ కార్డును ఆధార్‌తో (పాన్-ఆధార్ లింక్) లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మీరు ఇప్పటివరకు ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయకుంటే గడువులోపు చేయండి. లేకుంటే మీరు రూ.1000 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.  

ప్రభుత్వం గడువు ఇచ్చింది 

ఆధార్ కార్డులో పాన్ లింక్‌ను ప్రభుత్వం 2023 మార్చి 31ని దీనికి చివరి తేదీగా ఉంచింది. మీరు గడువు కంటే ముందు మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే.. మీరు దీని కోసం రూ.1000 జరిమానా చెల్లించాలి. అంతేకాదు పాన్‌ను చివరి తేదీ వరకు ఆధార్‌తో లింక్ చేయకపోతే.. ఆ పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది. 

ఆదాయపు పన్ను శాఖ ట్వీట్

ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ఓ ట్వీట్‌ చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం మినహాయింపు పొందిన వర్గంలోకి రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను 31.03.2023లోపు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని ట్వీట్‌లో పేర్కొంది. ఆధార్‌తో లింక్ చేయని పాన్‌ కార్డులు 01.04.2023 నుంచి క్యాన్సిల్ అవుతాయని స్పష్టం చేసింది. 

 

ఇలా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయండి..

1. మీరు మీ పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేసి ఉంటే.. మీరు మీ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు.
2. ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ www.incometaxindiaefiling.gov.in కొత్త వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal కి వెళ్లండి .
3. ఇక్కడ ఉన్న 'లింక్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి 
4. మీ స్టాటస్‌ను చూడటానికి 'ఇక్కడ క్లిక్ చేయండి'పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి.
6. మీ పాన్ కార్డ్ ఇప్పటికే ఆధార్ కార్డ్‌కి లింక్ చేసి ఉంటే, అప్పుడు మీ పాన్ ఆధార్ నంబర్‌తో లింక్ చేసిందని తెలుస్తుంది. 
7. అయితే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ కానట్లయితే.. ఈ లింక్ పై క్లిక్ చేయండి  https://www.incometaxindiaefiling.gov.in/home .
8. ఇప్పుడు మీరు లింక్‌లో ఆధార్‌పై క్లిక్ చేయండి.
9. ఇక్కడ మీ వివరాలను ఇక్కడ నింపండి.
10. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసినట్లు మెసేజ్ వస్తుంది.

ఆధార్-పాన్ లింక్ SMS ద్వారా ఇలా..

మీకు స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేకపోతే.. మీరు SMS పంపడం ద్వారా పాన్, ఆధార్ కార్డ్‌లను కూడా లింక్ చేయవచ్చు. మీరు SMS సేవను కూడా ఉపయోగించాలనుకుంటే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి UIDPAN <12-అంకెల ఆధార్> <10-అంకెల PAN> అని టైప్ చేసి 567678 లేదా 561561కి SMS పంపండి. ఇలా చేసిన తర్వాత.. లింక్ గురించిన సమాచారం మీకు మెసేజ్ వస్తుంది.

Also Read: Gujarat Election 2022: నేడే గుజరాత్‌లో రెండో దశ పోలింగ్.. ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు వేసేది ఇక్కడే..  

Also Read: Viral Video: ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్న కవలలు.. రచ్చ మాములుగా లేదుగా.. వీడియో వైరల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News