Delhi Police Again reached hyderabad on amitshah fake video case: ఢిల్లీ పోలీసులు మరోసారి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం. దీంతో గాంధీ భవన్ లోను, కాంగ్రెస్ నేతల్లోనే టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 29 న తెలంగాణకు వచ్చారు. అంతేకాకుండా.. సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ మన్నె సతీశ్‌, ఆ పార్టీ నాయకులు నవీన్‌, శివకుమార్‌, అస్మా తస్లీమ్‌ ఉన్నారు. మే 1 విచారణకు ఆదేశించాలంటూ కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, తన తరపు లాయర్లతో ఢిల్లీ పోలీసులకు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Asaduddin owaisi: దేశంలోనే మహానటుడు మోదీ.. కీలక వ్యాఖ్యలు చేసిన మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ..


అంతేకాకుండా.. తాను ఒక స్టార్ క్యాంపెయినర్ వల్ల తనపై అనేక బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల హోమంత్రి అమిత్ షా రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ఒక ఫెక్ వీడియో సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, అన్ని కాంగ్రెస్ పార్టీల హ్యాండీల్స్ లలో వైరల్ గా మారింది. దీనిపై కేంద్రం హోంశాఖ సీరియస్ గా స్పందించింది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసుకూడా నమోదు చేశారు. మే 1 ఢిల్లీకి విచారణకు రావాలంటూ రేవంత్ తో పాటు మరికొందరికి 91 సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు.


ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన లీగర్ సెల్ ద్వారా ప్రత్యేంగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నేపథ్యంలో విచారణకు హజరు కాలేనంటూ తన లాయర్.. సౌమ్యా గుప్తా ద్వారా ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో మరోసారి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. 


బీజేపీని అన్ని విధాలుగా గట్టిగా ఎదురు దాడి చేస్తున్నానని, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించినందుకు తనపై , గాంధీభవన్ నేతలపై ఢిల్లీ పోలీసులను పంపి నోటీసులు ఇప్పించారన్నారు. ఒకప్పుడు.. బీజేపీ ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను పంపేదని ఇప్పుడు బీజేపీ ట్రెండ్ మార్చిందని సెటైర్ వేశారు. ఈసారి ఢిల్లీ పోలీసులను ముందుగా మోదీ టీమ్ రంగంలోకి దింపిందని అన్నారు.


Read More: Polling Time: ఠారెత్తిస్తున్న ఎండలు.. పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం..


ఢిల్లీ పోలీసులుద్వారా అమిత్ షా.. నోటీసులు ఇప్పించారని విమర్శించారు. అంతేకాకుండా.. ఇక్కడ ఎవరు కూడ భయపడేవారులేరన్నారు. దీనిపై గట్టిగా కౌంటర్ ఇస్తామన్నారు.వచ్చే ఎన్నికలలో బీజేపీని ఓడిద్దామంటూ పిలుపునిచ్చారు. కర్ణాటకలో, తెలంగాణలో బీజేపీని ప్రజలు ఓడించి బుద్ది చెప్పాలని కూడా సీఎం రేవంత్ ప్రచారంలో స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. అయితే.. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter