Polling Time: ఠారెత్తిస్తున్న ఎండలు.. పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం..

Polling Time: ఎండలో కొన్నిరోజులుగా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేశాయి. ఈ క్రమంలో ఓటింగ్ సమయంలోపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం పట్ల  రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : May 2, 2024, 09:05 AM IST
  • పోలిటికల్ పార్టీల విజ్ఞప్తి పై స్పందించిన ఈసీ..
  • ఎన్నికల సమయంపై కీలక నిర్ణయం..
Polling Time: ఠారెత్తిస్తున్న ఎండలు.. పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం..

Ec Extends polling time 1 hour in telangana due to heavy summer heat wave: దేశంలో ఒకవైపు ఎండల హీట్, మరోవైపు ఎన్నికల హీట్ కూడా ఒకదానికి మరోకటి ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలు కొన్నిరోజులుగా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం తొమ్మిదిదాటిందంటే చాలు.. భానుడు నిప్పులు కొలిమిలా మండిపోతున్నాడు. సాయంత్రం ఐదు దాటిన తర్వాత కూడా వేడిగాలులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉండగా.. దేశంలో నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. ఏడు దశల్లో ఎన్నికల జరుగునున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

మే 13 వ తేదీన  తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండల ప్రభావానికి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు, వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మేనెలలో మరింతగా ఎండలతో పాటు, తీవ్ర మైన వడగాల్పులు కూడా వీస్తున్నాయి. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు,నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అత్యవరసమైతేనే బైటకు వెళ్లాలని, అదికూడా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని మాత్రమే వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఎండల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారని, అందుకే పోలింగ్ సమయాన్ని పెంచాలని అనేక పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘంకు విజ్ఞప్తి చేశాయి.  ప్రజలు ఎండల వల్ల బైటకు రావడానికి జంకుతున్నారని, ముఖ్యంగా  పెద్దవారు, తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలింగ్ సమయంను పెంచాలని కూడా ఈసీని అభ్యర్థించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఈసీ పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ సమయాన్ని కాస్త ఒక గంటపాటు పెంచారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. ఈ క్రమంలో.. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించనున్నారు.

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

సామాన్యుడి చేతిలో ఓటు ఒక ఆయుధమని,అందరు దీన్ని ఉపయోగించుకుని తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలంటూ ఈసీ అనేక అవగాహాన కార్యక్రమాలు చేపడుతునే ఉంటుంది. అయిన కూడా కొందరు, ఎన్నికలను లైట్ గా తీసుకుంటారు. పోలింగ్ రోజు ఓటింగ్ వేయకుండా హాలీడే లాగా భావిస్తారు. కానీ దీనికి భిన్నంగా కొందరు సీనియర్ సిటీజన్లు, క్యూ లైన్‌ లలో నిలబడీ మరీ ఓటు వేస్తు, అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News