Mallu Bhatti vikramarka follower letter to cm revanth reddy on hydra: తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా కూల్చివేతల అంశం ప్రస్తుతం పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దీనిపై ఇప్పటికే అపోసిషన్ పార్టీలు, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేపనిలో పడ్డాయి. మరోవైపు సీఎం రేవంత్ మాత్రం హైడ్రా కాన్సెప్ట్ మీద ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇటీవల గవర్నర్ సైతం.. హైడ్రా ఆర్డినేన్స్ కు ఆమోదం కూడా తెలిపారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలకు మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని తరచుగా వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో.. గతంలో పలుమార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అవమాన పర్చారని కూడా వార్తలు వచ్చాయి. యాదాగిరి దర్శనం సమయంలో భట్టీ విక్రమార్కను కింద పీట మీద కూర్చొబెట్టడం,  రంజాన్ పండుగ సమయంలో ఇఫ్తార్ లో కూడా.. భట్టీని రేవంత్ రెడ్డి అవమార్చే విధంగా ప్రవర్తించాడని కూడా జోరుగా వచ్చాయి. కానీ భట్టీ విక్రమార్క మాత్రం ఇవన్ని పుకార్లు అంటూ కొట్టి పారేశారు. అయితే.. తాజాగా, మాత్రం.. డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు.. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యం హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కు లేఖ రాయడం ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


పూర్తి వివరాలు..


తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చెరువులు ఆక్రమించి అక్రమ కట్టడాలను, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల్ని హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అదే విధంగా ఇటీవల ముసీ నదిని సుందరీకరణ ప్రాజెక్ట్ సైతం చేపట్టారు. దీనిలో భాగంగా మూసీని ఆనుకుని అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.


ఇదిలా ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ లు, బీజేపీలు ప్రజలకు అల్టర్ నెటివ్  చూపించకుండా.. ప్రజలు ఉంటున్న గూడును కూల్చివేయడం ఎంత వరకు కరెక్ట్ అని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. అయితే..  ఇదే క్రమంలో..భట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడు, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యం.. హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కు ఘాటుగా లేఖను రాశారు. మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం అత్యంత దారుణమన్నారు.


Read more: Ghmc VS Hydra: హైడ్రా రంగనాథ్ వర్సెస్ ఆమ్రాపాలీ.. కాకరేపుతున్న ఉన్నతాధికారుల మధ్య వార్.. కారణం ఏంటంటే..?


పేదలకు సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, ఏకపక్షంగా హైడ్రాతో నివాసాలను నేలమట్టం చేయడం సబబు కాదన్నారు. ఇందిరమ్మ ఇండ్లని పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తే, ఇప్పుడు తెలంగాణలో అందుకు విరుద్ధంగా మన ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చేస్తుందన్నారు.ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి