KTR Comments on Devara Pre release Event Cancelled: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ వేదికగా రాజకీయాలు వేడెక్కాయి. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణలో ప్రభుత్వం తగిన భద్రత చర్యలు కల్పించకపోవడంతో ఈ వేడక అర్ధాంతరంగ ఆగిపోయింది. తాజాగా కేటీఆర్ హైదరాబాద్ లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ ఈవెంట్ క్యాన్సిల్ కావడం వెనక ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు. ప్రభుత్వం ఈ వేడుకకు తగిన భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మా పాలనలో రాగ ద్వేషాలకు అతీతంగా హైదరాబాద్ మహా నగరాన్ని కాపాడుకున్నాము.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రేసింగ్ లాంటి ఈవెంట్స్ హైదరాబాద్ లో నిర్వహించాము. ఇపుడు రేవంత్ సర్కార్ వచ్చాకా.. ఈ వేడుకు క్యాన్సిల్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో శాంతి భద్రతలు లోపించయన్నారు. అంతర్జాతీయంగా సంబంధించిన ఈ ఈవెంట్ చేయలేక చేతెలెత్తేసింది.  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించలేకపోయారు.
అంతేకాదు హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.


మరోవైపు హైదరాబాద్ లో హైడ్రా బుల్‌డోజర్లకు అడ్డంగా నేనుంటానన్నారు కేటీఆర్. బాధితులకు అండగా నిలుస్తామన్నారు.
హైదరాబాద్ నగరంలో హైడ్రా భాదితులందరికీ బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. వారికీ తగిన పునరావాసం కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. మా హయాములో హైదరాబాద్ మహా నగరంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టాము.


ముందుగా హైడ్రా భాదితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి.కూకట్ పల్లి నియోజక వర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టు ప్రస్తావించారు. అప్పట్లో నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని మున్సిపల్ కార్పోరేషన్ ముఖ్య భవనం, GHMC, బుద్ద భవన్, ఐమాక్స్, సెక్రటేరియట్ అన్ని  నాలాల పైనే ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన  మంత్రుల ఇండ్లు FTL బఫర్ జోన్ లో ఉన్నాయి. ముందుగా వాటిని కూల్చిన తర్వాతే సామాన్యులపైకి బుల్‌డోజర్లు నడిపించిండని రేవంత్ రెడ్డికి ఒకింత మాస్ వార్నింగ్ ఇచ్చాడు కేటీఆర్.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.