BJP Deal With TRS MLAs: బీజేపీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిందని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. వార్తల్లో కనిపిస్తున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులకు భారీ మొత్తంలో కోట్ల కొద్ది నగదు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఆశచూపి ప్రలోభ పెట్టేందుకు యత్నించారనేది పోలీసుల రైడ్స్ లో అరెస్ట్ అయిన నలుగురిపై ఉన్న ప్రధానమైన ఆరోపణ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఫామ్ హౌజ్ లో రైడింగ్ చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పడం వంటి వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ధర్మపురి అరవింద్ ఆ వీడియోలపై తనదైన స్టైల్లో స్పందించారు.


పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగ కాంతారావు.. ఈ నలుగురిలో వచ్చే ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవరని.. అలాంటి నేతల కోసం ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు కాదు కదా ఒక్క  వంద రూపాయలు పెట్టినా దండగే అని ఎద్దేవా చేశారు.



 


అంతేకాకుండా బేరసారాలు జరిపినట్టుగా చెబుతున్న ఫామ్ హౌజ్ కి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లినట్టు అని ప్రశ్నించారు. ప్రలోభ పెట్టడానికి సదరు వ్యక్తులు వస్తే.. మరి వీళ్లెందుకు అక్కడికి వెళ్లారని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. అన్నింటికి మించి రైడ్ జరిగే సమయంలోనే అంతకంటే ముందుగా టీఆర్ఎస్ పార్టీ అనుకూల ఛానెళ్లు ఎలా వెళ్లాయో చెప్పాలని అరవింద్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక ఇదంతా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ ( CM KCR ) తమ ఎమ్మెల్యేలతో కలిసి ఆడుతున్న నాటకంగా ధర్మపురి అరవింద్ అభివర్ణించారు.


Also Read : TRS MLAs Party change Deal: రోడ్డుపై బైఠాయించి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల, ఇంద్రకరణ్ రెడ్డి నిరసన


Also Read : Deal With TRS MLAs: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బ్రోకర్ల మంతనాలు.. ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల డీల్ !


Also Read : TRS MLAs Deal Issue: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలన్న స్కెచ్ అందుకే: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు