Deal With TRS MLAs: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బ్రోకర్ల మంతనాలు.. ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల డీల్ !

Deal To Buy TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి ఓ ముఠా రంగంలోకి దిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఈ డీల్‌కి పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

Written by - Pavan | Last Updated : Oct 27, 2022, 07:51 AM IST
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఫామ్ హౌజ్‌లో భారీ డీల్
  • నిందితులతో సహా భారీ మొత్తంలో పట్టుబడిన నోట్ల కట్టలు
  • ఇది బీజేపి పనే అంటున్న టీఆర్ఎస్ నేతలు
Deal With TRS MLAs: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బ్రోకర్ల మంతనాలు.. ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల డీల్ !

Rs 100 Cr Deal with TRS MLAs: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఆ నలుగురు వ్యక్తులు.. పార్టీ మారితే వారికి భారీ మొత్తంలో నగదుతో పాటు, కాంట్రాక్టులు, పదవులు కట్టబెడతాం అని ప్రలోభపెడుతున్నారని అందిన ఫిర్యాదుతో పోలీసులు రైడ్ చేసి ఆ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

వారి వద్ద నుంచి రూ. 15 కోట్ల రూపాయల విలువ చేసే నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు బయటపడటంతో అవాక్కవడం పోలీసుల వంతయ్యింది. ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు ఇచ్చి డీల్ సెట్ చేసుకునేందుకు ఢిల్లీకి చెందిన నలుగురు వ్యక్తులు తమతో బేరసారాలు జరుపుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బీరం హర్షవర్థన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డిలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి వీరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకే తాము రైడ్ చేసి వారిని పట్టుకున్నామని తెలిపారు.

ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారే ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాగా మరొకరు బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పైలట్ రోహిత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తాండూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రేగ కాంతా రావు ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిగా చెబుతున్న ఏజెంట్లలో ఒకరు ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఆలయ అర్చకుడు కాగా మరొకరు తిరుపతికి చెందిన అర్చకుడిగా తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలు ఉన్న బ్యాగులను పోలీసులు వాహనంలో స్టేషన్‌కి తరలించారు.

Also Read : Weavers Welfare Schemes: చేనేత రంగం కోసం కేంద్రం నయా పైసా ఇవ్వలేదన్న మంత్రి కేటీఆర్

Also Read : Munugode Elections: మునుగోడులో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు.. ఇప్పటివరకు ఎన్ని కోట్లంటే..?

Also Read : Bandi Sanjay: కేసీఆర్ అబద్దాల చిట్టా పేరిట పోస్టర్లను విడుదల చేసిన బండి సంజయ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News