Dharmapuri Arvind: ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ జోష్యం చెప్పాడు. ఆయన జైలుకు వెళ్తే మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తదితరులు పండుగ చేసుకుంటారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక రేవంత్‌ రెడ్డి గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నికవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్‌ రెడ్డి


 


నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కోరుట్ల, ఐలాపూర్‌, మల్లాపూర్‌లో గురువారం ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ప్రచారం చేశారు. ఓటర్లను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం జరిగిన ఓ సభలో అరవింద్‌ మాట్లాడారు. 'బ్యాగులు మోసిన కేసు దగ్గరపడింది. ఆ కేసులో జూలై 14వ తేదీన రేవంత్‌ రెడ్డికి డెడ్‌లైన్‌. ఈ వార్త విని జూలై 14 ఎప్పుడు వస్తుందని కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క్‌ లాంటి వాళ్లు పండుగ చేసుకుంటున్నారు' అని ఆరోపించారు.

Also Read: Fake Video Case: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. ఫేక్‌ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్‌?


 


ఇక రేవంత్‌ రిజర్వేషన్లపై చేస్తున్న వ్యాఖ్యలపై అరవింద్‌ స్పందిస్తూ.. 'ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముట్టేది లేదు. వాటిలో నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదు. మోదీ బతికి ఉన్నంత కాలం ఎవరూ కూడా ఈ రిజర్వేషన్లు ముట్టుకోరు' అని స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రచారానికి పోతే గ్యారంటీల సంగతి ఏమిటని ప్రజలు అడుగుతారనే భయంతో కొత్త నాటకం మొదలుపెట్టాడని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బహిరంగ సభల్లో రేవంత్‌ రెడ్డి గుడ్లు మోయడాన్ని తప్పుబట్టారు. ఆయనకు అంటే బుద్ధి లేదు.. రేవంత్‌ రెడ్డికి చెప్పాల్సింది పోయి 75 ఏండ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డి కూడా గుడ్డు మోస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.


కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధర్మపురి అరవింద్‌ విమర్శించారు. కేసీఆర్‌పై లంకెబిందెలు అని చెబుతున్న రేవంత్‌ రెడ్డి .. కుండ లేదు.. బుట్ట లేదు ఏదీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ముస్లిం రాజ్యం అయిపోయి దేశం మూడు ముక్కలవుతుందని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter