దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్ మార్టం
దిశ అత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు .. నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది.
దిశ అత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు .. నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది. ఢిల్లీ.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ .. (ఎయిమ్స్) వైద్యులతో రీ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ వైద్యుల బృందం . . హైదరాబాద్ చేరుకుంది. గాంధీ ఆస్పత్రిలోని మార్చురీలో ఢిల్లీ వైద్యులు సోమవారం ఉదయం రీ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభించారు. ఇది సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా నలుగురు నిందితుల మృతదేహాల కోసం నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశారు. రీ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత .. నివేదికను ఢిల్లీ వైద్యుల బృందం సీల్డ్ కవర్ లో భద్రపరచనుంది. ఆ తర్వాత ఆ రిపోర్టును నేరుగా హైకోర్టుకు సమర్పించే అవకాశం కనిపిస్తోంది.
[[{"fid":"180663","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
గాంధీ ఆస్పత్రి వద్ద భారీ భద్రత
దిశ అత్యాచారం, హత్య కేసు.. ఆ తర్వాత నిందితుల ఎన్ కౌంటర్ కేసు చాలా సున్నితమైనవి కావడంతో .. గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పెద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.