COVID-19 updates:హైదరాబాద్‌ : తెలంగాణలో గురువారం రాత్రి నాటికి గత 24 గంటల్లో 14,027 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా.. 1,676 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో అత్యధికంగా 788 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చల్ జిల్లాలో 160, కరీంనగర్ జిల్లాలో 92, నల్లగొండ జిల్లాలో 64, వనపర్తి జిల్లాలో 51, సంగారెడ్డి జిల్లాలో 50, వరంగల్ అర్బన్ జిల్లాలో 47, నాగర్ కర్నూల్ జిల్లాలో 30, మెదక్ జిల్లాలో 26, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 20 చొప్పున, మహబూబాబాద్ జిల్లాలో 19, ఖమ్మం జిల్లాలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. ( Also read: AP: కరోనా తీవ్రరూపం.. 24 గంటల్లో 40 మంది మృతి )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8 చొప్పున, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో 7 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో 6 చొప్పున, సిద్దిపేట, గద్వాల, కామారెడ్డి జిల్లాల్లో 5 చొప్పున, మంచిర్యాల 4,  సిరిసిల్ల 3, జగిత్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1 చొప్పున కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నేడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ( Health bulletin ) పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 41,018 మందికి చేరుకుంది. కరోనా కారణంగా ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 396 కు చేరింది ( COVID-19 deaths ). ( Also read: Covid19 Vaccine: భారత్‌కు మాత్రమే ఆ సామర్ధ్యం )


నేడు 1,296 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మొత్తం 27,295 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,22,693 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests in Telangana ) నిర్వహించారు. ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )