హైదరాబాద్‌ : తెలంగాణలో మంగళవారం రాత్రి వరకు గత 24 గంటల్లో 13,175 మందికి కొవిడ్‌-19 పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,524 మందికి కరోనావైరస్ పాజిటివ్‌ ఉన్నట్టుగా గుర్తించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరుకుంది. కరోనావైరస్‌ ( Coronavirus ) కారణంగా నేడు 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 375కు చేరింది. ( Also read: COVID-19 rules: మాస్క్ లేకుండా పట్టుబడితే.. ఇక అంతే )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1161 మంది నేడు కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 24,840 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా ప్రస్తుతం 12,531 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 


రోజూ వారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులలో ( COVID-19 cases ) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కేసుల సంఖ్యే భారీగా ఉంటుండటం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ( Also read: HRD ministry: ఆన్‌లైన్ క్లాసెస్‌కి కేంద్రం కండిషన్స్ )