Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల వీళ్లే.. ఎంపిక ప్రక్రియ ఇలా..
Indiramma Housing Scheme: దరఖాస్తుదారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఒక్కో ఇంటికి ఒక్కరినే అర్హులుగా ఎంపిక చేస్తారు.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సొంత జాగా ఉన్న పేదాలకు రూ.5 లక్షలు కేటాయించనుంది. అమరులకు 250 గజాల స్థలాన్ని కూడా కేటాయించనుందట.
అర్హులు ఎవరంటే?
1. దరఖాస్తుదారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
2. వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఒక్కో ఇంటికి ఒక్కరినే అర్హులుగా ఎంపిక చేస్తారు.
ఈ పథకం స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రతిఏటా ఎంతమంది అర్హులను ఎంపిక చేయనుంది తదితర విషయాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.
ఇదీ చదవండి: Free Bus To Medaram: మేడారం జాతరకూ ఉచిత బస్సు.. పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది: డిప్యూటీ సీఎం
అయితే, తాజాగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఎంపిక ప్రక్రియ కూడా ముమ్మరం చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోందట. ఈ పథకం కింద దాదాపు 84 లక్షల వరకు అప్లకేషన్స్ రాగా వాటిని ఆధునిక సాంకేతికతో వడపోత కార్యక్రమం చేపట్టనున్నారట.
ఇదీ చదవండి: Mahalakshmi Scheme: మహిళల ఖాతాల్లో ఆరోజే రూ.2,500 జమా.. మహాలక్ష్మి పథకంపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook