Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుకు (Heart attack) గురైన ఓ పేషెంట్, అతనికి చికిత్స అందించిన వైద్యుడు (Doctor) నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు వదిలారు. పేషెంట్‌కు చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆ వైద్యుడికీ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం ఆ పేషెంట్‌ను మరో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా... అతనూ మార్గమధ్యలోనే మృతి చెందాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాంధారి మండలం (Kamareddy) గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తికి గుండెపోటుకు రాగా... వెంటనే అతన్ని గాంధారి పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ లక్ష్మణ్ అనే డాక్టర్ అతనికి చికిత్స చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలినట్లు తెలుస్తోంది. గుండెపోటుకు (Heart attack) గురవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు చెబుతున్నారు. వెంటనే ఆ పేషెంట్‌ను అతని కుటుంబ సభ్యులు మరో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.


కానీ మార్గమధ్యలోనే ఆ పేషెంట్ కూడా ప్రాణాలు వదిలాడు. నిమిషాల వ్యవధిలో అటు డాక్టర్, ఇటు పేషెంట్ ఇద్దరూ గుండెపోటుతో (Heart attack) మృతి చెందడం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడైన డా.లక్ష్మణ్ గుండెపోటుతో చనిపోవడం స్థానికులను (Kamareddy) విస్మయానికి గురిచేస్తోంది. ఆయన మరణవార్త తెలిసి గాంధారి పట్టణవాసులు ఆసుపత్రికి క్యూ కట్టినట్లు తెలుస్తోంది. డా.లక్ష్మణ్ ఎంతో ఆరోగ్యంగా కనిపించేవారని... అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి చనిపోవడం నమ్మశక్యంగా లేదని స్థానికులు వాపోతున్నారు.


Also Read: Septic Tank Cleaners Died: సెప్టిక్ ట్యాంక్ లో పడి ఇద్దరు కార్మికులు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook