తెలంగాణ సర్కారుకు విరాళాల వెల్లువ
`కరోనా వైరస్` తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న వైరస్ బాధితుల సంఖ్య గుబులు పుట్టిస్తోంది. దీంతో కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.
'కరోనా వైరస్' తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న వైరస్ బాధితుల సంఖ్య గుబులు పుట్టిస్తోంది. దీంతో కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.
[[{"fid":"183746","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈ క్రమంలో తెలంగాణలో మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. తెలంగాణలోని పారిశ్రామికవేత్తలు మేము సైతం సర్కారుకు తోడుగా నిలుస్తామంటూ ముందుకొచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సుబులిటీ కింద ప్రభుత్వానికి చేతనైనంత సాయం చేస్తున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీ ఇందులో మొదటి వరసలో ఉంది. కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఆ కంపెనీ అధినేత మంత్రి కేటీఆర్ ను కలిసి తమ వంతు సాయాన్ని చెక్కు రూపంలో అందించారు .
[[{"fid":"183747","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
అలాగే విర్చో పెట్రోకెమికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కూడా కోటి రూపాయల విరాళాన్ని అందించింది. కరోనా వైరస్ ను పారదోలేందుకు మేము సైతం మీకు తోడుగా ఉన్నామని ఆ కంపెనీ అధినేత తెలిపారు.
[[{"fid":"183748","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
మరోవైపు సుచిర్ ఇండియా, ఐఆర్ఏ రియాలిటీ సంస్థలు తమ వంతు సాయంగా చెరో 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించాయి. ఆ కంపనీల నుంచి సీఈవోలు మంత్రి కేటీఆర్ ను కలిసి చెక్కులు అందించారు.
అటు చిన్న పిల్లలు సైతం మేము కూడా సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విహాన్, వివాన్ అనే ఇద్దరు పిల్లలు తమ కిడ్డీ బ్యాంకు నుంచి కూడబెట్టిన డబ్బును సీఎం సహాయ నిధికి అందించారు. ఇద్దరూ కలిసి 4 వేల 355 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళంగా ఇచ్చారు. వీరిద్దరినీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..