Congress 6 Guarantees: 6 గ్యారెంటీల అమలుకు ఇంటింటి సర్వే.. ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి..!
Congress 6 Guarantees: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల అమలుపై మరో అప్టేడ్ వచ్చింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నఅర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
Congress 6 Guarantees: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల అమలుపై మరో అప్టేడ్ వచ్చింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నఅర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారెంటీల అమలుకు సర్వే చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈనేపథ్యంలో దరఖాస్తుదారులు కొన్ని ముఖ్యమైన పత్రాలను రెడీగా పెట్టుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 5 గ్యారంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
రేషన్ కార్డులేని వారు చాలా మంది ఉన్నారు.ఇక దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని కూడా చెప్పారు.
రేవంత్ సర్కార్ తమ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసింది. మిగిలిన గ్యారెంటీల అమలుకు ఇంటింటి సర్వే మొదలుపెట్టింది. 200 యూనిట్ల విద్యుత్, రూ.500 కే సిలిండర్, మహిళలకు రూ.2,500 పథకాల అమలుకు ఈ అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు ఈ సర్వే చేపట్టింది. సంబంధిత సిబ్బంది త్వరలోనే సర్వే మొదలుపెట్టనున్నారట. ఇది ఎప్పటి నుంచి అనేది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు.
పథకాలకు అవసరమయ్యే పత్రాలన్నీకలిగి ఉంటే లబ్ధిదారులు పథకాలకు అర్హులుగా ఎంపికవుతారు. ఈ ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకున్నవారు సబ్మిట్ చేసిన రిసీట్ తోపాటు సరైన అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అంతేకాదు వీరి వద్ద సరైన ఆధాయ ధృవీకరణపత్రంతోపాటు వారి దరఖాస్తుదారుని వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇదీ చదవండి: Free Electricity: రేషన్ కార్డు ఉన్నవారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్: సీఎం రేవంత్ రెడ్డి
ఇదీ చదవండి: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook