Mancheryala district: చల్లని బీర్లు దొరుకుతలేవ్.. సర్కారుకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు..
Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Drinker of mancherial district has writes letter to congress government: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. సామాన్య ప్రజలుబైటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అత్యవసకరమైతేనే బైటకు వెళ్తున్నారు. ఉద్యోగులు, ఇతర ప్రైవేటు రంగంవారు తప్పని సరిగా బైటకు వెళ్తున్నారు. ఎండలో బైటకు వెళ్లే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. చాలా మంది కూలీ పనులకు, వెల్డింగ్ లు, ఇళ్ల నిర్మాణం పనులు చేసే వారికి ఎక్కువగావైన్ లు, బీర్ లు తాగే అలవాటు ఉంటుంది. వీరంతా పొద్దునంతా కష్టపడి వచ్చి రాత్రికి బీర్ లేదా వైన్ ను తాగుతుంటారు. దీంతో తమ బాడీ పెయిన్స్ తెలియకుండా.. సేదతీరుతుంటారనిచెబుతారు.
ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కేఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని అక్కడి తాగుబోతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బీర్ షాపులన్ని సిండికేట్ గా మారిపోయి, కాస్లీ బీర్లను మాత్రమే అమ్ముతున్నారన్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. దీంతో తాగుబోతుల జిల్లా ప్రెసిడెంట్ తరుణ్ ఏకంగా జిల్లా అబ్కారీ శాఖ అధికారులకు వినతీ పత్రం ఇచ్చాడు. కొన్నిరోజుల పాటు వేచిచూశాడు. అయిన కూడా సమస్య పరిష్కారం కాలేదు.
దీంతో లాభంలేక.. అతగాడు ఏకంగా ప్రభుత్వానికి కూడా ఒక లేఖను రాశాడు. తమ సమస్యలను పరిష్కరించాలని కూడా ఆయన వెరైటీగా ప్రభుత్వంకు విన్నవించుకున్నాడు. కొందరు కావాలనే.. కేఫ్ లైట్ బీర్లు లేకుండా చేస్తున్నారని, దీనిలో తక్కువ మార్జీన్ ఉండటం వల్ల బీర్ షాపుల వారు అమ్మడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంకు తాగు బోతుల సంఘం ప్రెసిడెంట్ లేఖను రాశాడు. స్ట్రాంగ్ బీర్ తాగడం వల్ల..తమకు కడుపులో మంట, తలనొపి, వాంతులు సమస్యలు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితులలో తమ ఆరోగ్యం పాడౌతుందంటూ కూడా ఆవేదన చెందుతున్నాడు.
వెంటనే చోరవ తీసుకుని కేఫ్ లైట్ బీర్లు అమ్మేలా చూడాలని మంచిర్యాల పెద్దపల్లి తాగుబోతుల సంఘం ప్రెసిడెంట్ తరుణ్ ప్రభుత్వంను కోరారు. చాలా మందికి ఎండకాంలో వైన్ లేదా బీర్ లు తాగే అలవాటు ఉంటుంది. ఇవి కొద్దిగైన తాగకపోతే.. వారు తీవ్ర గందరగోళంకు గురౌతుంటారు. అంతేకాకుండా.. కొందరు వైన్ పట్ల అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఆ సమయానికి మందు వారికి దొరక్కపోతే వింతగాను ప్రవర్తిస్తుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter