Drugs Peddler Lakshmipati Arrested: ఇటీవల డ్రగ్స్ కారణంగా హైదరాబాద్‌లో తొలి మరణం నమోదైన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌కు బానిసైన ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న లక్ష్మీపతిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న లక్ష్మీపతి కోసం గత ఐదు రోజులుగా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీపతి బీటెక్ స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి గంజాయికి అలవాటు పడ్డాడు. క్రమంగా దానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి హాష్ ఆయిల్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించేవాడు. లీటర్‌కు రూ.1 లక్ష చొప్పున కొనుగోలు చేసి రూ.8 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విద్యార్థులకు విక్రయించేవాడని తేల్చారు.


సోషల్ మీడియా ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా లక్ష్మీపతి డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో లక్ష్మీపతి భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు నిర్దారించారు. లక్ష్మీపతిపై గతంలోనూ పలు కేసులు నమోదవగా... పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా లక్ష్మీపతి పోలీసులకు పట్టుబడటంతో అతన్ని విచారిస్తే డ్రగ్స్ దందాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 


Also Read: Revanth Reddy: అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టు ఉంది కేసీఆర్ తీరు: రేవంత్ రెడ్డి


Also Read: Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ సినిమాలో రష్మిక.. నేషనల్ క్రష్ ఫస్ట్ లుక్ అవుట్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook