మా పిల్లలను డ్రగ్స్ టెస్టుకు తీసుకొస్తా... టెస్టులకు కేటీఆర్‌ను పంపుతావా... కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్...

Revanth Reddy Challanges CM KCR: సంచలనం రేపుతోన్న హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 03:37 PM IST
  • డ్రగ్స్ కేసుపై స్పందించిన రేవంత్ రెడ్డి
  • తన మేనల్లుడని చెబుతున్న ప్రణయ్ రెడ్డిని టెస్టులకు తీసుకొస్తానన్న రేవంత్
  • కేటీఆర్‌ను టెస్టులకు పంపిస్తారా అని కేసీఆర్‌కు రేవంత్ సవాల్
మా పిల్లలను డ్రగ్స్ టెస్టుకు తీసుకొస్తా... టెస్టులకు కేటీఆర్‌ను పంపుతావా... కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్...

Revanth Reddy Challanges CM KCR: సంచలనం రేపుతోన్న హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పిల్లలను అడ్డు పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తన కుటుంబం, బంధువుల్లో ఎవరెవరిపై డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానం ఉందో చెబితే... టెస్టుల కోసం అందరినీ తానే వెంటపెట్టుకుని వస్తానని అన్నారు. తన మేనల్లుడని చెబుతున్న సూదిని ప్రణయ్ రెడ్డితో శాంపిల్స్ ఇప్పిస్తానన్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తన కొడుకు కేటీఆర్‌ను డ్రగ్స్ టెస్టులకు పంపించాలని సివాల్ విసిరారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ మరో పంజాబ్‌లా మారుస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. డ్రగ్స్‌కు బానిసై అక్కడి యువత నిర్వీర్యమయ్యారని అన్నారు. తెలంగాణను కూడా పంజాబ్‌లా మార్చేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. అసలు ఫుడ్ అండ్ మింక్‌ పబ్‌లో 142 మంది యువతీ యువకులు పట్టుబడితే... వారందరికీ టెస్టులు చేయకుండా ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆరే స్వయంగా పోలీస్ అధికారికి ఫోన్ చేసి చూసీ చూడనట్లు వదిలేయాలని చెప్పారని ఆరోపించారు. దీన్నిబట్టి వారికి కావాల్సిన వారు ఎవరో అందులో ఉన్నారని ఆరోపించారు.

తన మేనల్లుడు ప్రణయ్ రెడ్డి పట్టుబడినట్లు చెబుతున్నారని... అతన్ని విడిచిపెట్టమని తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ పోలీసులపై లేదా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అతనికి టెస్టులు చేయకుండా తామేమైనా అడ్డుపడ్డామా అని నిలదీశారు. అందరి నుంచి నమూనాలు సేకరించి నిజాలు నిగ్గు తేల్చాల్సింది పోయి అందుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. డ్రగ్స్ వ్యవహారానికి తొలి నుంచి తాను వ్యతిరేకంగా పోరాడుతున్నానని... టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగుచూసినప్పుడు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశానని గుర్తుచేశారు. 

ఆ కేసు విచారణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో కాకుండా ఈడీ, ఎన్సీబీ, డీఆర్ఐ, సీబీఐలతో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాల్సిందిగా కోరానన్నారు. ఆ కేసుకు సంబంధించి మొత్తం సమాచారాన్ని ఈడీకి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తే ఇప్పటికీ స్పందన లేదన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం బయటపడినప్పటి నుంచే కేటీఆర్‌కు ఇండస్ట్రీపై పట్టు పెరిగిందని... దాన్ని అడ్డుపెట్టుకుని సినీ ఇండస్ట్రీని తన అదుపులో పెట్టుకున్నాడని ఆరోపించారు.

Also Read: Hyderabad Drugs Case: ఆ 'మూడు టేబుళ్ల'పై ఫోకస్... కూపీ లాగుతున్న పోలీసులు

Vimala Raman Wedding: తమిళవిలన్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News