దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యహ్నం 3 గంటల వరకు 71.10 శాతం పోలింగ్ జరిగింది. ఐదు గంటల వరకు 81.44 శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం 7 గంటల వరకు 82.06 శాతం పోలింగ్ జరిగింది. బైపోల్స్ కోసం ఎన్నికల అధికారులు మొత్తం 315 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Onions on Subsidy: రైతుబజార్లలో రూ.35కే ఉల్లి...ఎలా కొనుగోలు చేయాలి అంటే..


కరోనావైరస్ సంక్రమణ ప్రమాదం ఉండటంతో అన్ని కోవీడ్-19 ( Covid-19 ) నియమాలను పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అధికారులు ముందుగా 85 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


అదే సమయంలో దుబ్బాక ప్రజలు ( Dubbaka ) ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియగా.. మరో గంట పాటు కోవిడ్19 బాధితులకు అవకాశం కల్పించారు.



Also Read | LPG New Rules: గ్యాస్ బుక్ చేసే ముందు ఈ  కొత్త రూల్ తెలుసుకోవాల్సిందే



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR