Onions at RS.35 Per KG: రైతుబజార్లలో రూ35కే ఉల్లి...ఎలా కొనుగోలు చేయాలి అంటే..

Onions Price In  Rythu Bazaars | అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లి ( Onions Price In Telangana ) ధరలు ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రీటైల్, కిరాణా షాపుల్లో వారు పెట్టిన ధరలకు ఉల్లిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు. 

Last Updated : Oct 25, 2020, 08:43 PM IST
    1. అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లి ధరలు ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
    2. రీటైల్, కిరాణా షాపుల్లో వారు పెట్టిన ధరలకు ఉల్లిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు.
    3. హోల్ సేల్ ధరలపై కూరగాయలు అమ్మే రైతు బజార్ లో కూడా రూ.80-90 లకు కిలో ఉల్లిపాయలను అమ్ముతున్నారు.
Onions at RS.35 Per KG: రైతుబజార్లలో రూ35కే ఉల్లి...ఎలా కొనుగోలు చేయాలి అంటే..

Onions in Hyderabad Rythu Bazaar | అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లి ( Onions Price In Telangana ) ధరలు ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రీటైల్, కిరాణా షాపుల్లో వారు పెట్టిన ధరలకు ఉల్లిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు. హోల్ సేల్ ధరలపై కూరగాయలు అమ్మే రైతు బజార్ లో కూడా రూ.80-90 లకు కిలో ఉల్లిపాయలను అమ్ముతున్నారు.

Also Read | AP Covid-19 Updates: ఏపీలో రికార్డు స్థాయిలో సాంపిల్స్ పరీక్ష

ఇక మార్కెట్ లో అయితే రూ.100 కిలో ఉల్లిపాయలు అమ్ముతున్నారు. దీంతో తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీకి అమ్మాలని అని నిర్ణయించింది.  హైదరాబాద్ నగరంలో ఉన్న 11 రైతు బజార్లలో రూ.35 ప్రతీ కిలో అమ్మనుంది. ఐడెంటిఫికేషన్ కార్డులు చూపించి ప్రతీ వ్యక్తి రెండు కిలోల వరకు రైతు బజార్లలో ( Hyderabad Rythu Bazaars ) ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 

పండగ సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖను ఉల్లిపాయలను రూ.35కు కిలో లెక్కన అమ్మమని సూచించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో  కురిసిన వర్షాల వల్ల పంటనష్టం కలగింది. దీంతో అనుకున్న స్థాయిలో పంట చేతికి అందలేదు. దీంతో ఉల్లి ధరలకు లెక్కలొచ్చాయి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News