Earthquake in telugu States: తెలంగాణలో ని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా  భూమి కంపించింది.  ఈ భూకంపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై 5.3 మాగ్నిట్యూడ్‌గా గుర్తించారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో 5నుంచి 15 సెకండ్ల వరకు భూమి స్వల్పంగా  కంపించింది. భయాందోళనలో స్థానికులు.. ఉదయాన్నే సిటీ మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ఏం జరుగుతుందో అర్థంకాక జనం భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌, రంగారెడ్డితో పాటు హైదరాబాద్‌లోని హయత్ నగర్, పెద్ద అంబర్ పెట్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్‌, నార్సింగి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7: 27 గంటలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఐదు సెకన్లపాటు భూమి కంపించింది.


ఉదయం 7:28 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. భూకంపం దెబ్బకు కుర్చీలో కూర్చున్న ప్రజలు సైతం కింద పడిపోయారు. కరీంనగర్‌ విద్యానగర్‌లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి.


అటు ఆంధ్ర ప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. విజయవాడలో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ అర చేతిలో పెట్టుకొని భయంతో బయటకు పరుగులు పెట్టారు. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.