Eatala Rajender slams TRS party and CM KCR: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపి ఘన విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తనను ఓడించాలని ప్రత్యర్థులు చేసిన కుట్రలను నియోజకవర్గంలోని ఓటర్లు తిప్పికొట్టారని అన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు మాత్రం తన పక్షానే నిలిచారని అన్నారు. అధికార పార్టీ కుట్రలను తిప్పికొడుతూ తనను గెలిపించిన వారికి శిరసు వంచి వందనం చేస్తున్నానని అన్నారు. తనపై ఓటర్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటానని ఈటల రాజేందర్ (Eatala Rajender) మరోసారి హామీ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shock to CM KCR - కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు..
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు లాంటిదని, కేసీఆర్ ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోకుండా డబ్బు సంచులను, అన్యాయం, అక్రమాలను నమ్ముకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. చివరికి శ్మశానంలో కూడా నోట్ల కట్టలు పంచిపెట్టారని, అధికార పార్టీ కావడంతో ఇష్టారీతిన అధికార దుర్వినియోగం చేశారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ వైఖరి పట్ల విసుగుచెందిన వాళ్లు, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ వాదులు కేసీఆర్ అహంకారం పోవాలని కోరుకున్నారని.. వారు కోరుకున్నట్టుగానే హుజూరాబాద్ ఫలితం (Huzurabad bypolls results) వచ్చిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 


Also read : Eatala Rajender కి అందుకే మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటూ Komatireddy సంచలన వ్యాఖ్యలు


BJP efforts - విజయం వెనుక బీజేపి శ్రమ
హుజూరాబాద్ ఉప ఎన్నికలో సాధించిన ఈ ఘన విజయం తనలో మరింత బాధ్యతను పెంచిందని ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. తన విజయం వెనుక ఎన్నో కష్టాలను ఓర్చుకుని నిలబడి పోరాడిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారని, వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. 


ఆ 5 అంశాలపైనే తన పోరాటం..
ఇకపై 5 అంశాలపైనే తన పోరాటం ఉంటుందని ఈటల రాజేందర్ తెలిపారు. దళిత బంధు పథకం (Dalitha Bandhu scheme) తరహాలో ప్రభుత్వం మిగతా కులాలకు ఆర్థికసాయం అందించడం, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, తెలంగాణ నినాదమైన నీళ్లు - నిధులు - నియామకాలు, 57 ఏళ్లు నిండినవారికి వృద్ధాప్య పెన్షన్లు (Old age pensions in Telangana), రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే తాను పోరాడతానని ప్రకటించారు.


Also read : Huzurabad by-poll results: హజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన Revanth Reddy


Also read : Minister KTR: హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook