Huzurabad by-poll results: హజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన Revanth Reddy

Revanth Reddy response on Huzurabad by-poll results: హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా వెంకట్‌ బల్మూరికి (Venkat Balmoori) పార్టీలో భవిష్యత్ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 03:59 AM IST
Huzurabad by-poll results: హజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన Revanth Reddy

Revanth Reddy response on Huzurabad by-poll results: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమికి గల కారణాలపై పార్టీ నేతలతో చర్చిస్తానని చెప్పిన ఆయన... ఈ ఒక్క ఓటమితో కాంగ్రెస్ యువ నేత బల్మూరి వెంకట్ కుంగిపోవాల్సిన అవసరం అసలే లేదని అతడికి వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా వెంకట్‌ బల్మూరికి (Venkat Balmoori) పార్టీలో భవిష్యత్ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad by-poll results) ఓటమి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహలకు గురికావద్దని, అధైర్య పడాల్సిన పని అసలే లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వయసు రీత్యా మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే సత్తా తనకు ఉందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఇదిలావుంటే, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజులే మిగిలి ఉందనే వరకు తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడం అందుకు ఓ కారణమైతే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy, Huzurabad by-poll results) నియామకం ఇష్టం లేని అసంతృప్త నేతలు ఈ ఎన్నికలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఓటమికి మరో కారణమయ్యాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending News