Ramoji Rao Biography: సైకిల్‌పై పచ్చళ్లు విక్రయించిన రామోజీ.. వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడో తెలుసా?
Ramoji Rao Biography: ఈనాడు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అధిపతి రామోజీ రావు ఈరోజు ఉదయం 3.45 నిమిషాలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయస్సు రీత్యా వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఆయన మరణానికి ప్రధాన కారణం
Ramoji Rao Biography: ఈనాడు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అధిపతి రామోజీ రావు ఈరోజు ఉదయం 3.45 నిమిషాలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయస్సు రీత్యా వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఆయన మరణానికి ప్రధాన కారణం, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును నిన్న హైదర్‌బాద్ నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్సత్రికి తరలించారు. ఈనేపథ్యంలో ఆయన తెల్లవారుజామున మృతిచెందారు. కొన్ని ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు అధినేత, మీడియా దిగ్గజం, ఫిల్మ్ ప్రొడ్యూసర్, ప్రపంచంలోనే అతి పెద్ద రామోజీ ఫిల్మ ప్రొడక్షన్‌ను అధినేత, ఈనాడు న్యూస్ పేపర్స్, ఈటీవీ నెట్కర్క్స్, కొన్ని టీవీ ఛానల్స్, ఉషా కిరణ్ మూవీస్, మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్పిన్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ రామేజీరావు అధ్యర్యంలోనే నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో రామేజీరావు బయోగ్రఫీ ఏంటో తెలుసుకుందాం.
రామోజీరావు బయోగ్రఫీ..
చెరుకూరి రామోజీ రావు 1936 నవంబర్ 16న కృష్ణజిల్లా పెద్దపారుపూడిలో జన్మించారు రామోజీరావు. ఈయన తల్లిదండ్రులు చెరుకూరి వేంకట సుబ్బారావు, వేంకట సుబ్బమ్మలు. వీళ్లది వ్యవసాయ కుటుంబం. తెలుగు భాషపై ఆయనుకు ఉండే అభిమానం అంతా ఇంతా కాదు..రామోజీ భార్య రమాదేవి. ఇయనకు సుమన్ , కిరణ్ ఇద్దరు సంతానం. కెరీర్ మొదట్లో సైకిల్ పై ఊరూరా తిరుగుతూ పచ్చళ్ల వ్యాపారం కూడా చేశారట. ఆ తర్వాత కుబుంబ సమేతంగా హైదరాబాద్‌కు మకాం మార్చారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రారంభించారు. అలా మొదలైన మార్గదర్శి అంచెలంచలుగా పైకి ఎదిగింది.
1969లో అన్నదాత అనే మ్యాగజైన్‌ను ప్రారంభించారు రామోజీరావు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు, మెషీన్లను ఇందులో ప్రచురిస్తారు. ఇప్పటికీ ఈ మ్యాగజైన్ మొదటిస్థానంలో ఉంది.
వ్యాపార నిమిత్తం ఆసమయంలో ఏడాదిలో కొన్ని నెలలు రామోజీరావు విశాఖపట్నంలో ఉండాల్సి వచ్చింది. అయితే, ఈయనకు పేపర్ చదివే అలవాటు ఎక్కువ ఉండేది. అప్పుడు న్యూస్ పేపర్లు విజయవాడలో అచ్చు అయి విశాఖపట్నం వచ్చే వరకు సాయంత్రం అయ్యేది. దీంతో ఆయన ఇబ్బంది పడేవాళ్లు. దీంతో రామోజీరావుకు ఓ ఐడియా వచ్చింది. తానే పూర్తిగా మీడియా రంగంలో ఎందుకు దిగకూడదు అనుకున్నారు. అదే పని చేశారు.దీంతో విశాఖలో ఈనాడు సర్క్యూలేషన్ పెరిగింది. అలా హైదరాబాద్‌లో రెండో యూనిట్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికీ అగ్రగామిగా కొనసాగుతుంది.
ఇదీ చదవండి:ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?
1980లో హైదరాబాద్‌లో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు. ప్రియా ఫుడ్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కళాంజలి కూడా ప్రారంభించారు. 1997 ఆగస్టు 27న ఈటీవీని ప్రారంభించారు. సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. సినిమా నిర్మాణంతోపాటు మయూరీ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభించారు. శ్రీవారికి ప్రేమలేఖలు, మయూరీ, నువ్వేకావాలి, పిపుల్స్ ఎన్‌కౌంటర్, అశ్వినీ నువ్వే కావాలికి ఆయన జాతీయ అవార్డు కూడా పొందారు.
సినిమా నిర్మాతల షూటింగ్ లొకేషన్ కోసం పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని 1996 లో ఒకే ప్రాంతంలో సినిమా నిర్మాణం చేపట్టడానికి రామోజీ ఫిల్మ్ సిటీని ప్రాంరభించారు. దేశవిదేశాల నుంచి పర్యాటనకు వస్తారు.
ఇదీ చదవండి:ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్
అవార్డులు..
రామేజీరావుకు 2016లో పద్మవిభూషణ్ పొందారు.
ప్రతిఘటన సినిమాకు 1985 లో ఫిల్మ్‌ఫేయిర్ అవార్డు లభించింది. ఎన్నో నందిఅవార్డులు కూడా వచ్చాయి. కంచనగంగ, మయూరీ, మౌన పోరాటం, అశ్వినీ, తేజ వంటి సినిమాలకు అవార్డులు వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter