Nalgonda Warangal Khammam Graduate MLC Election: తెలంగాణలో వరుసగా ఎన్నికల హీట్ కొనసాగుతుంది. ఇప్పటికే లోక్ సభకు ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక దీని ఫలితాలను జూన్ 4 వ తేదీన విడుదల కానున్నాయి. ఈ క్రమంలో మరో ఎన్నికలకు తెలంగాణ రెడీ అవుతుంది. తెలంగాణలో మే 27 న మూడు జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలు ముఖ్యంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం పరిధిలోని జరుగనున్నాయి. ఈ మూడు జిల్లాలలో.. కొత్తగా విభజించిన 12 జిల్లాలు ఉన్నాయి. ఇక ఇక్కడ గ్రాడ్యూయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సత్తాచాటాలని అన్ని పార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.  ఆయా జిల్లాల పరిధిలోని బ్యాంకులు కూడా ఆరోజున మూసి ఉండనున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..


పట్టభద్రులైన ఎంప్లాయిస్ అంతా.. తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఎన్నికల సంఘం ప్రకటించిన ఈ నిర్ణయంతో నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట మొత్తంగా 12 జిల్లాల్లోని పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హలీడే లభించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కంపెనీ వాళ్లు తమ ఓటు హక్కును ఏవిధంగా ఉపయోగించుకొవాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆయా జిల్లాల పరిధిలోని ఉద్యోగులు పనివేళల్లో మార్పులు చేసుకొని, వీకాఫ్ లు అడ్జస్ట్ మెంట్ లు చేసుకుని లేదా స్పెషల్ పర్మిషన్ ఇవ్వాంటూ కూడా ఈసీ యాజమాన్యాలకు సూచనలను జారీ చేసింది.


ఈ ఎన్నికలను తెలంగాణలోని అన్నిపార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో ఉంటున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పట్టభద్రుల ఉప ఎన్నికల బరిలో నిలబడ్డారు.  పట్టభద్రులు.. ఎంతో ఆలోచించి తమకు మంచి చేసేవారిని ఎన్నుకుంటారని ఇటీవల తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎంపీ ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  


Read more: Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..


మరోవైపు బీఆర్ఎస్ కూడా..  ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్నిరకాల అస్త్ర శస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికలో అధిక సీట్లు గెలిచి, కాంగ్రెస్ కు ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయం తెలసేలా తమకు భారీ మెజార్టీ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు భారీగా ఓట్లు వేసి, మంచి నాయకుడిని ఎన్నుకొవాలంటూ కోరుతున్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter