Navneet Kaur: ఈసీ సీరియస్ .. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ పై పోలీసు కేసు.. అసలేంజరిగిందంటే..?
BJP navneet Kaur: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే విధంగా షాద్ నగర్ లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Election Commission Serious Amravati mp navneet kaur comments on congress party: తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ , బీజేపీలు, బీఆర్ఎస్ లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకొవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో..ఇటీవల బీజేపీ నాయకత్వం హైదరబాద్ ఎంపీ స్థానంపై ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా మాధవీలతను ఈసారి ఎలాగైన గెలిపించేలా బీజేపీ తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలంతా వరుసగా వచ్చి ప్రచారం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, నడ్డా, రాజాసింగ్, కిషన్ రెడ్డిల వంటి వారంతా మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
మాధవీలతకుకూడా ఓల్డ్ సిటీలో అన్ని వర్గాల వారిని కలుపుకోని పోతూ, ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె మాధవీలతకు సపోర్ట్ గా ప్రచారం నిర్వహించారు. అసద్ సోదరులు గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా, మరోసారి కౌంటర్ ఇచ్చారు. పోలీసులు పక్కకు జరిగితే.. పదిహేను సెకన్లలో అసద్ సోదరుల ఆటకట్టిస్తామంటూ హెచ్చరించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్థాన్ కు ఓటు వేసినట్లే నంటూ విమర్శించారు. ఓల్డ్ సిటీకి అసద్ సోదరులు చేసిందేమి లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. నవనీత్ కౌర్ రాణా మహబూబ్ నగర్ షాద్ నగర్ లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కూడా కాంగ్రెస్ కు ఓటు వేస్తే, దాయాది దేశం పాక్ కు ఓటు వేసినట్లే అంటూ విమర్శించారు. ప్రజలంతా ఎంతో ఆలోచించి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. ఈనేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఈసీ అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేయాలని షాద్ నగర్ పోలీసులను ఆదేశించింది.
Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
ఇదిలా ఉండగా.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే.. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. వెంటనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ పోలీసులతో కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా..ఎన్నికలలో నాయకులు డబ్బులు, మద్యం పంచి ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా నివారిస్తుంది. రాజకీయ పార్టీల నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తే ఈసీ వారిపై చర్యలు కూడా తీసుకుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter