Election Results 2023: కాంగ్రెస్ గెలుపుకు సునీల్ కనుగోలు వ్యూహాల ఎఫెక్ట్ ఎంత..కనుగోలు మంత్రాలు ఫలించాయా?
Election Results 2023: సునీల్ కనుగోలు వ్యూహాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతగానో పని చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రధాన కారణాలు ప్రజల్లో బీఆర్‌ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఒకటైతే..రెండవది సునీల్ కనుగోలు వ్యూహాలే. కానుగోలు వ్యూహాలు పని చేయడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)పై కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచి ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 53 స్థానాల్లో గెలుపొందంది. 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణలో అధికారంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వచ్చింది. దీంతో వరసగా రెండవ సారి కూడా బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోని వచ్చింది. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దిశగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకుపోవడానికి గల కారణాలేంటో తెలుసా? ఈ విజయానికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే..తెలంగాణలో కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానిని ప్రధాన కారణం సునీల్ కనుగోలు వ్యూహకర్త..గత కొద్ది రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరంలో సొంత రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కానుగోలు కాంగ్రెస్‌కు బంపర్ విజయాన్ని అందించేందుకు కీలక పాత్ర పోషించాడు. తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించి పార్టీని విజయ దిశగా తీసుకెళ్లారు. కానీ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో మాత్రం ఈ సునీల్ కనుగోలు వ్యూహం పని చేయకపోవడం విశేషం.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
రాజస్థాన్ ఎన్నికలపై కానుగోలు బృందం రిపోర్ట్ ఇచ్చిన కాంగ్రెస్ నెగ్లెక్ట్ చేసిందని అధికారిక సమాచారం. రాజస్థాన్‌లో ఈ టీం కాంగ్రెస్ నాయకత్వం లేని అభ్యర్థులు లేదా గెలిచే అవకాశం లేని అభ్యర్థులకు టిక్కెట్లు నిరాకరించాలని కాంగ్రెస్ హై కమాండ్‌కి తెలిపింది. అంతేకాకుండా గెలుపుపొందడానికి పలు నేతలకు సలహాలు కూడా ఇచ్చినట్లు సమాచారం.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే..ఎన్నికల్లో భాగంగా సునీల్ కనుగోలు సంస్థ సంబంధించిన చాలా మంది బ్యాక్‌రౌడ్‌లో పని చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ విజయాని వారు రచించి యాడ్స్, వ్యూహాలు ఎంతగానో సక్సెస్ అయ్యాయి. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకుని పార్టీ విజయాని కావాల్సిన సునీల్ కనుగోలు వ్యూహాలు ఎంతగానో పని చేశాయి. ఏది ఏమైనా గొప్ప చరిత్ర కలిగి బీఆర్‌ఎస్ పార్టీని ఓడించిన కనుగోలు వ్యూహాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి