Electricity Charges: విద్యుత్‌ ఛార్జీల పెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం భారీ భారం మోపలేదని చెబుతూనే మోపింది. పేదలకు ఊరట లభించగా మధ్య తరగతి ప్రజలకు మాత్రం ప్రభుత్వం కరెంట్‌ షాకిచ్చింది. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ కొన్ని ప్రతిపాదనలను తిరస్కరిస్తూనే మరికొన్నింటికి ఆమోదం తెలిపింది. వాటిలో మధ్య తరగతి ప్రజలకు మాత్రం భారం పడింది. దీపావళి పండుగ పూట మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించకపోవడంతో వారి జేబులు ఖాళీ కానున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Secretariat: సోషల్‌ మీడియాలో లైక్‌లు, పోస్టులు, కామెంట్లు చేయొద్దు.. పోలీసులకు ప్రభుత్వం వార్నింగ్‌


విద్యుత్‌ చార్జీల పెంపుపై ఈఆర్సీ కమిషన్ చైర్మన్ శ్రీరంగరావు బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బహిరంగ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజల విజ్ఞప్తులు, అభిప్రాయాలు సేకరించింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేల వాదనలు కూడా పరిగణనలోకి తీసుకుంది. పలుసార్లు అభిప్రాయాలు సేకరించిన ఈఆర్సీ కమిషన్‌ ప్రతిపాదనలను కొన్నింటిని ఆమోదించి మరికొన్నిటిని తిరస్కరించింది. ఈ విషయాన్ని చైర్మన్‌ శ్రీరంగరావు వెల్లడించారు.

Also Read: KTR Brother In Law: కేటీఆర్‌ బావమరిది పార్టీ కేసులో ఎలాంటి అరెస్ట్‌లు ఉండవు


 


'సామాన్యులపై ఎటువంటి విద్యుత్ భారం లేదు. కాకపోతే 800 యూనిట్లు దాటిన వారిపై స్వల్పంగా చార్జీల పెంపు ఉంటుంది' అని శ్రీరంగరావు వెల్లడించారు. అయితే ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని.. రూ.25,000 కోట్లు ఇవ్వాలి. డిస్కమ్‌లు నష్టాలు తగ్గించుకునేందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వీలైనంత త్వరగా తీసుకోవాలి' అని చెప్పారు. ఏరియర్స్ తొందరగా ఇస్తే.. డిస్కమ్‌లు తొందరగా నష్టాల నుంచి బయటపడతాయని పేర్కొన్నారు.


'బహిరంగ విచారణలో సలహాలు, సూచనలు అన్ని పరిశీలించాం. మా పదవీకాలం రేపటితో ముగియనుంది. ఇటీవలే విద్యుత్ నియంత్రణ భవన్‌ను ప్రారంభించాం. కేవలం 40 రోజుల్లో 8 పిటిషన్లపై సమగ్ర పరిశీలన చేసి వివేకంతో పని చేశారు. ప్రజలపై భారం పడకుండా.. ప్రభుత్వం ఇస్తున్న రాయితీని కూడా దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇవ్వాల్సి ఉంది. రెవెన్యూపై ట్రూఅప్ చార్జీల భారం పడకుండా ఏ కేటగిరీకి కూడా పవర్ చార్జీల పెంపు లేదు' అని చైర్మన్‌ శ్రీరంగరావు వివరించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ  రాయితీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.


ఈఆర్సీ ఆమోదం, తిరస్కరణలు ఇవే..


  • 300 యూనిట్ల పైబడిన వారికి ఫిక్స్‌డ్‌ ఛార్జీలు పెంచాలని వచ్చిన ప్రతిపాదన తిరస్కరణ

  • 800 యూనిట్ల పైబడిన వారికి ఫిక్స్‌డ్‌ ఛార్జీలు పెంచేందుకు అంగీకారం.

  • 100కు కమిషన్ ఆమోదించింది

  • ఇండస్ట్రీస్ ఎల్‌టీ3 150 ఫిక్స్‌డ్‌ ఛార్జీలు పెంచాలని ప్రపోజల్ పెట్టారు. దాన్ని 100కు కమిషన్ పరిమితం చేసింది.

  • పౌల్ట్రీ ఫామ్‌కు రూ.100 పెంచాలని ప్రతిపాదనలు చేయగా ఆమోదం తెలపలేదు

  • హెచ్‌టీ కేటగిరీ ఎనర్జీ ఛార్జీలు పెంచాలని వచ్చిన ప్రతిపాదనలు తిరస్కరణ

  • 33 కేవీ వారికి రూ.7.15 ఉన్న ప్రతిపాదనను ఆమోద ముద్ర పొందలేదు

  • 11, 33, 132 కేవీలకు సంబంధించిన ఛార్జీలో ఎలాంటి పెంపు లేదు. యథాతథంగా అమల్లోకి ఉంటాయి.

  • బస్సు, రైల్వేకు సంబంధించిన వాటిని కూడా పెంచలేదు

  • లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 270 ఫిక్స్‌డ్‌ ఛార్జీలను పెంపు ప్రతిపాదనకు ఆమోదం

  • టైం ఆఫ్ డే.. పీక్ హవర్‌లో విద్యుత్ వినియోగించే వారికి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు

  • రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్ వినియోగించే వారికి రూ.1.50 పెంపుకు ఆమోదం

  • చేనేత హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 20కి పెంచాం

  • డొమెస్టిక్ కేటగిరీ 1 హార్టికల్చర్ వంటి వాటిని 15 హెచ్‌పీ నుంచి 20 హెచ్‌పీకి పెంపు

  • ఎల్పీ ఈవీ ఛార్జింగ్‌లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు

  • గ్రిడ్, స్టాండ్ బై ఛార్జీలకు ఆమోదం.

  • 5 నెలల వరకే ఆర్‌ఎస్‌టీ ప్రతిపాదనలు అమలులో ఉంటాయి. నవంబర్ 1 నుంచి మార్చి 24 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ఛార్జీల సవరింపుతో వినియోగదారులపై ఐదు నెలల కాలానికి రూ.30 కోట్ల భారం.

  • స్థిర ఛార్జీలు రూ.10 యథాతథం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook