KCR Changes TRS to BRS: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ బీజేపి కీలక నేత ఈటల రాజేందర్ తనదైన స్టైల్లో స్పందించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసినట్టు చెప్పుకున్న ఉద్యమ పార్టీని కతం పట్టించి, తెలంగాణ కోసం పాటుపడిన ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేశారని ఈటల రాజేందర్ అన్నారు. కేసిఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించడం కోసమే టీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసి బీఆర్ఎస్ స్థాపిస్తున్నట్టు ఈటల అభిప్రాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్‌కి ఇక తెలంగాణతో ఉన్న బంధం కాస్తా తెగిపోయింది
బీఆర్ఎస్ పార్టీ స్థాపనతో తెలంగాణకి కేసిఆర్‌కు మధ్య ఉన్న బంధం, సంబంధం కూడా పూర్తిగా తెగిపోయిందన్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయిందని పేర్కొన్నారు. 


అవి నమ్ముకునే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నారు
మద్యాన్ని, డబ్బుని ప్రలోభాలను నమ్ముకునే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారని.. కానీ అక్రమంగా వెనకేసుకున్న ధనంతో దేశంలో రాజకీయం చెలామణి చేయాలని పగటి కలలు కంటున్న కేసీఆర్‌కి అది ఒక కలగానే మిగిలిపోతుందని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. 


కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాడా.. కేసీఆర్‌ని ఎద్దేవా చేసిన ఈటల రాజేందర్
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ స్వరాష్ట్రంలో సమస్యలను పరిష్కరించలేనివాడు.. దేశాన్ని ఉద్దరిస్తానంటే ఎలా నమ్మగలం అని ఈటల రాజేందర్ సూటిగా ప్రశ్నించారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా అంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల విశ్వాసం కోల్పోయాడని.. ఇక కొత్తగా దేశానికి చేసేదేమీ లేదని కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈటల రాజేందర్ చేసిన ఈ ఆరోపణలు, విమర్శలపై బీఆర్ఎస్ బాస్ కేసీఆర్, ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.


Also Read : Bharatiya Rashtra Samiti: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.. కేసీఆర్ సంచలన ప్రకటన..


Also Read : Revanth Reddy: యూపీఏను చీల్చడానికే జాతీయ పార్టీ..సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి