Harish Rao slams Etela Rajender:హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో మంత్రి హరీష్ రావు తన కంటే ఎక్కువ అవమానాలపాలయ్యారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ పార్టీ నుంచి వెళ్లిపోవడానికి ఆయనకు ఉండే కారణాలు ఆయనకు ఉండొచ్చు గానీ తాను వెళ్తూవెళ్తూ తనకు నైతిక బలం, మద్దతు పెంచుకోవడం కోసం నా భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటే అది ఆయన పొరపాటే అవుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు, తన పేరు చెప్పుకుని సానుభూతి పొందాలని చూసిన తీరు వికారం కలిగించిందని హరీష్ రావు అసహనం వ్యక్తంచేశారు. తాను గతంలో అనేక వేదికలపైనా చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా.. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాను టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మంత్రి హరీష్ రావు తేల్చిచెప్పారు. 


CM KCR నాకు గురువు, మార్గదర్శి కూడా..
ఈటల రాజేందర్ తన గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో ఆయా అంశాల గురించి మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు మాత్రమే కాదు.. తనకు గురువు, మార్గదర్శి, తండ్రి సమానులు అని అన్నారు. పార్టీ ఏర్పడిననాటి నుంచి నేటివరకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పార్టీ కార్యకర్తగా ఆ పని చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని, పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చినా ఆయన మాట జవదాటనని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు. 


ఈటల రాజేందర్ వెళ్లినంత మాత్రానే TRS కి వచ్చే నష్టం లేదు..
Etela Rajender పార్టీని వీడినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీకి కలిగే నష్టం ఏమీ లేదని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే పార్టీకి ఆయన చేసిన సేవ కంటే.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ. అందుకే ఈటల రాజేందర్ పార్టీ నుంచి వెళ్లిపోతే కొత్తగా కోల్పోయేదేం లేదని హరీష్ రావు (Minister Harish Rao) పేర్కొన్నారు.