Etela Rajender's health condition:హైదరాబాద్: పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన మోకాలికి ఆపరేషన్ చేయాలని సూచించారు. మోకాలికి శస్త్ర చికిత్స నేపథ్యంలో ఈటల రాజేందర్ వారం, పది రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పది రోజులు పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు డాక్టర్ సూచనల మేరకే మళ్లీ పాదయాత్ర ఎప్పుడు చేపట్టేది ఏంటనేది సందేహాలపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు ఈటల రాజేందర్ పాదయాత్రపై (Etela Rajender padayatra) సందిగ్ధత తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


Also read : దళిత బంధు పథకం కోసం లక్ష కోట్లయినా వెనక్కి తగ్గం: హాలియా సభలో సీఎం కేసీఆర్


హుజూరాబాద్‌ ఉప ఎన్నిక (Huzurabad bypolls) నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో 22 నుంచి 25 రోజుల పాటు ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర చేపట్టాలని భావించారు. ఆ ప్రకారమే పాదయాత్ర మొదలుపెట్టిన ఈటల రాజేందర్... 12 రోజుల పాటు విజయవంతంగా పాదయాత్ర కొనసాగించారు. 


ఇదిలావుంటే, మోకాలికి శస్త్ర చికిత్స (Etela Rajender's knee surgery) అనంతరం ఈటల రాజేందర్ కోలుకున్నాకా తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.


Also read : దళిత బంధు పథకంపై తెలంగాణ హైకోర్టు ఛీప్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook