దళిత బంధు పథకంపై హై కోర్టులో పిల్ దాఖలు

PIL filed against Dalita Bandhu scheme: దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడే దళిత బంధు పథకం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ ఈ పిల్ దాఖలైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2021, 09:39 PM IST
దళిత బంధు పథకంపై హై కోర్టులో పిల్ దాఖలు

PIL filed against Dalita Bandhu scheme: దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరగనుండాల్సి ఉండగా అంతకంటే ముందే అక్కడే పైలెట్‌ ప్రాజెక్ట్‌గా దళిత బంధు పథకాన్ని అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ముందు నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకం అమలు వెనుకున్న లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్‌ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్‌ పార్టీల నేతలు హైకోర్టులో  (Telangana High court) పిల్‌ దాఖలు చేశారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషనర్లు ఈ పిల్‌ దాఖలు చేశారు. 

Also read : పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేసీఆర్.. టీఆర్ఎస్‌లో చేరిన పెద్ది రెడ్డి

హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దళిత బంధు పథకం (Dalita Bandhu scheme) ప్రవేశపెడుతున్న విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై హై కోర్టు ఏమని స్పందించనుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

Also read : దళిత బంధును వ్యతిరేకిస్తే సహించం: ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News