KCR Phone Call To Telangana DGP: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేటీఆర్ బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. దురుద్దేశపూర్వకంగా.. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లల్లో తనిఖీలు చేయడంపై ఖండించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డీజీపీకి స్వయంగా ఫోన్ చేసి పరిస్థితులు ఆరా తీశారని సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Raj Pakala: బావమరిది రేవ్‌ పార్టీలో కేటీఆర్‌, ఆయన భార్య శైలిమ లేరు


హైదరాబాద్‌ శివారులోని జన్వాడ గ్రామ పరిధిలో కేటీఆర్‌ బావ మరిది రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌లో శనివారం రాత్రి ఓ పార్టీ జరిగిందని సమాచారం. దీనిపై ఆదివారం ఉదయం నుంచి పోలీసులు నానా హడావుడి చేస్తున్నారు. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని పోలీసులు రెచ్చిపోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అంతేకాకుండా కుటుంబసభ్యుల ఇళ్లపై అనుమతి లేకుండా.. నోటీసు ఇవ్వకుండా తనిఖీలు చేపట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్‌ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగారు.

Also Read: KTR: ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు రేవంత్‌ రెడ్డి మూసీ నది జపం


ఈ వ్యవహారంలో తెలంగాణ డీజేపీకి నేరుగా ఫోన్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. ఫామ్ హౌస్ ఇష్యూపైన పోలీసులు వ్యవహరిస్తున్న చర్యపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజు పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలపై డీజీపీకి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 'ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు  ఎందుకు చేస్తున్నారు' అని ప్రశ్నించారని చర్చ జరుగుతోంది. సోదాలు వెంటనే ఆపాలని డీజీపీని కోరినట్లు తెలుస్తోంది. విపరీత పోకడలకు పోతే మంచిగుండదని హెచ్చరించినట్లు కూడా సమాచారం. కేసీఆర్‌ హెచ్చరికతో పోలీసులు కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై అతి త్వరలోనే కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


కాగా ఈ వ్యవహారంలో పోలీసులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నారు. కేటీఆర్‌ బంధువులే లక్ష్యంగా సోదాలు చేస్తున్నారు. అది కూడా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తనిఖీలు చేపడుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై త్వరలోనే పోలీస్‌ శాఖ కూడా ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook