KCR Navagraha Yagam: తెలంగాణ ఆధ్యాత్మికతను మరోస్థాయికి పెంచిన నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. ఆయనకు దేవుడిపై భక్తి చాలా ఎక్కువ. వ్యక్తిగతంగాను.. రాజకీయ కార్యక్రమాల్లోనూ ఏనాడూ సంప్రదాయాలను విస్మరించలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద యాగం ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేశారు. తర్వాత కూడా చాలా యాగాలు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్‌ యాగం చేశారు. అయితే యాగానికి గల కారణం తెలిస్తే మాత్రం షాకవుతారు. జైలు నుంచి విడుదలైన తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోసం యాగం చేసినట్లు తెలుస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TPCC President: తలపండిన కాంగ్రెస్‌ నాయకులకు షాక్‌.. పంతం నెగ్గించుకున్న రేవంత్‌ రెడ్డి


శాసన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత అనేక గండాలు చుట్టుముట్టాయి. కిందపడి తుంటి ఎముకకు చికిత్స పొందడం.. కుమార్తె కవిత అరెస్టవడం.. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం వంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి రాజకీయాలకు కొంత దూరమైన కేసీఆర్‌ తాజాగా యాగం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్‌ రావు స్ట్రాంగ్‌ వార్నింగ్‌


సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం నుంచి నవగ్రహ మహాయాగం చేపట్టారు. పట్టువస్త్రాల్లో తన సతీమణి శోభతో కలిసి కేసీఆర్‌ యాగం ప్రారంభించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రతువులో ఆయన కుమార్తె కవిత కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే ఈ యాగం ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ఎవరికీ తెలియదు. కుటుంబసభ్యులు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ యాగంలో ఉన్నారు. అయితే యాగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు. 


కవిత కోసమే మొక్కు?
అనూహ్యంగా ఈ యాగం నిర్వహించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అధికారం కోల్పోవడం.. అనారోగ్యం ఏర్పడడం.. కుటుంబసభ్యులు ఇబ్బందులు పడడం వంటి పరిణామాలతో కేసీఆర్‌ ఈ యాగం నిర్వహించడానికి కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా తన గారాలపట్టీ కవిత కోసం ఈ యాగం నిర్వహించినట్లు సమాచారం. తిహార్‌ జైలు నుంచి విడుదలైన కవిత కోసం యాగం చేపట్టినట్లు తెలుస్తోంది. కవిత విడుదలైతే యాగం చేస్తానని మొక్కుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మళ్లీ రాజకీయంగా బలపడడం.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఈ యాగం చేపట్టినట్లు కూడా చర్చ నడుస్తోంది. కేసీఆర్‌ గతంలో ఇదే మాదిరి కొన్ని యాగాలు నిర్వహించారు.


కేసీఆర్‌ చేపట్టిన యాగాలు
2015లో చండీయాగం
2018లో రాజశ్యామల యాగం
2023లో రాజశ్యామల యాగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter