Harish Rao vs Revanth: అపసవ్య పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇష్టారీతిన రెచ్చిపోయి మాట్లాడుతూ రేవంత్‌ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజీవ్‌ విగ్రహావిష్కరణలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Challenge: నిమజ్జనం సాక్షిగా రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం: కేటీఆర్‌ సంచలన ప్రకటన


 


'రాష్ట్రానికి రేవంత్ మేలు చేస్తున్నారా.. కీడు చేస్తున్నారా ప్రజలు ఆలోచించాలి. బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేయాలి. సీఎం పదవిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్‌లాగా వ్యవహరించడం లేదు. ప్రజా పాలన ప్రసంగంలో అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టించేందుకు  బురద జల్లుతున్నారు' అని హరీశ్‌ రావు మండిపడ్డారు.


Also Read: Balapur Laddu: బాలాపూర్‌ లడ్డూ గెలిస్తే కొంగు బంగారమే! వేలం విజేతల జాబితా ఇదే!


 


'100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు కాలే. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. కేసీఆర్ సీఎం కాగానే మొదటి నెలలోనే రూ.2 వేలు పింఛన్ చేశారు. ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడుపుతున్నారు. రూ.4 వేల పింఛన్ ఎందుకు చేయాలే' అని ప్రశ్నించారు. 2024 మార్చి వరకు తీసుకునే అప్పులను గత ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారని మండిపడ్డారు. 'అప్పుల విషయాన్ని నిండు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్బంగా చెప్పా. పదేపదే బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న అప్పు రూ.4.26 లక్షల కోట్లు అని నేనే చెప్పా. ఈ ప్రభుత్వం అసెంబ్లీలో రూ.6.85 లక్షలపైన ఉందని కాంగ్రెస్ శ్రేణులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజా పాలనలో రేవంత్ రూ.7 లక్షల అప్పు అంటున్నాడు' అని 


'నేను దివాళా అంటే రాష్ట్రం పరపతిని దిగదార్చుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే నువ్వు తిడుకున్న గోతిలో నువ్వే పడుతావు. రాష్ట్ర భవిష్యత్ కంటే నీకు రాజకీయాలే ముఖ్యమయ్యాయి. రాష్ట్ర ప్రజల కిచ్చిన హామీలు అమలు చేయు' అని హరీశ్ రావు సవాల్‌ విసిరారు. 'కేసీఆర్‌ను తిట్టడమే పరమావధిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహం కుప్పఅయ్యాయి. దీనితో పిల్లలు అగమవుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.


'జై తెలంగాణ అననోళ్లు అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. దీనితో వారి ఆత్మ ఘోషిస్తోంది. 2013-14లో రూ.1,43,739 ఉంటే తలసరి ఆదాయం  రూ.3,47,221తో కి పెరిగింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి  రూ.4,51,580 కోట్లు ఉంటే నేడు రూ.14,63,9,63 లక్షలకు పెరిగింది' అని హరీశ్ రావు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చాం. దాని గురించి ఎందుకు మాట్లాడావు. రేవంత్ చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు మంచిపాలన అందించు' తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter